గత కొద్దికాలంగా సోషల్ మీడియా వేదికగా ధనుష్, నయనతార మధ్య సాగిన వివాదం గురించి అందరికీ తెలిసిందే. నయనతార కు సంబంధించిన డాక్యుమెంటరీ నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ నెట్ ఫిక్స్ లో ప్రసారమవుతున్న నేపథ్యంలో ఈ వివాదం ప్రారంభమైంది. తనకు ముందుగా ఇన్ఫామ్ చేయకుండా.. తన దగ్గర నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోకుండానే తన సెట్స్ కు సంబంధించిన వీడియోను ఈ డాక్యుమెంటరీ లో వాడారు అని ధనుష్ నయనతార, ఆమె భర్త పై కేసు వేశారు. ఈ నేపథ్యంలో చెలరేగిన దుమారం అందరికీ తెలిసిందే.
మరోపక్క నయనతార ధనుష్ పై ఓ ఓపెన్ లెటర్ కూడా రాశారు. అయితే ఈ నేపథ్యంలో కేవలం ఆమె డాక్యుమెంటరీ నేను ప్రమోట్ చేసుకోవడం కోసం నయనతార చేస్తున్న డ్రామా ఇది అంటూ నేటిజెన్లు కొందరు ఆమెను విమర్శించారు. అయితే వీటిపై ఘాటుగా స్పందించిన నయనతార తాను పబ్లిసిటీ కోసం ఎదుటివారి ఇమేజ్ను దిగజార్చాలి అనుకునే వ్యక్తిని కాదు అంటూ స్పష్టం చేశారు.
ఇంతకీ అసలు విషయం ఏమిటంటే నయనతార ఆమె భర్త విఘ్నేష్ కలిసి పనిచేసిన ‘నానుమ్ రౌడీ ధాన్’ క్లిప్స్ ను కొన్ని ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారు. ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ లో ధనుష్ కూడా ఒకరు. ఈ నేపథ్యంలో 10 కోట్ల రూపాయల నష్టపరిహారం డిమాండ్ చేస్తూ ఆయన వీరికి లీగల్ నోటీసులు పంపించారు. దీనిపై తాజాగా ఇంటర్వ్యూలో స్పందించిన నయనతార.. ధనుష్ తనతో డైరెక్ట్ గా మాట్లాడడానికి నిరాకరించిన కారణం వల్ల ఈ విషయాన్ని పబ్లిక్ గా తీసుకువెళ్లడం తప్ప తనకు వేరే మార్గం లేదు అంటూ పేర్కొన్నారు.
ఇక మూవీకి సంబంధించిన క్లిప్పు గురించి మాట్లాడుతూ.. ధనుష్ మేనేజర్ కి విగ్నేష్ ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు.. పైగా సినిమాలో విగ్నేష్ రాసిన నాలుగు లైన్లను మాత్రమే మేము మా డాక్యుమెంటరీలో ఉపయోగించుకున్నాము.. అది కూడా కేవలం మా ఇద్దరికీ చాలా ముఖ్యమైనది కాబట్టి మాత్రమే. పైగా ధనుష్మాకు మంచి ఫ్రెండ్ కాబట్టి మా ఎమోషన్స్ ని అర్థం చేసుకుని ఓకే చెబుతారు అని భావించాను.
అంతేకాదు “ అయితే ఈ విషయంపై అతనితో మాట్లాడాలి అని ఎంత ప్రయత్నించినా కుదరలేదు. నిజంగా మాపై ధనుష్ కోపంగా ఉన్నారా? లేక చుట్టూ ఉన్న వ్యక్తులు అలా సృష్టిస్తున్నారా? అన్న విషయం నాకు తెలియదు కానీ.. ఇటువంటివి ముందుగా క్లియర్ చేసుకోకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బంది వస్తుంది. ఎప్పుడైనా ఒకరికొకరు ఎదురుపడినప్పుడు కనీసం హాయ్ కూడా చెప్పుకోలేని స్థితి నాకు నచ్చదు. డాక్యుమెంటరీ ట్రైలర్ లో కూడా మా ఫోన్లో అప్పుడెప్పుడో తీసుకున్న ఓ చిన్న విజువల్ ని ఉపయోగించాం. అయితే అతని సినిమాలో ఫుటేజ్ ఉపయోగించలేదు.. బి టి ఎస్ కూడా ఇప్పుడు ఉన్న ఒప్పందంలో భాగం మాత్రమే.. అతనిపై అతని అభిమానులకు ఎంత ప్రేమ గౌరవం ఉన్నాయో మాకు కూడా అంతే ఉన్నాయి.. కానీ ఇటువంటివి జరిగినప్పుడు కాస్త బాధనిపిస్తుంది “అని నాయనతార పేర్కొంది.