తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ కుటుంబాలు ఎన్నో ఉన్నాయి.. కానీ మీమర్స్ కి బూస్ట్ తాగినంత బలం ఇచ్చే కుటుంబం మాత్రం ఒకటే.. అదే మంచు కుటుంబం. ఎందుకంటే మోహన్ బాబు కుటుంబం సినిమా యాక్టింగ్ కంటే కూడా వివాదాలపరంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు మొదటి నుంచి ఎంతో దూకుడైన వైఖరి ప్రదర్శించడం అందరికీ తెలుసు. ఎన్నో ఈవెంట్లలో ఆయన మాట్లాడిన మాటలు పలు రకాల కాంట్రవర్సీలకు దారి తీసాయి .ఇక ఇప్పుడు వయసు పెరిగిన మోహన్ బాబు లో ఆ దూకుడు మాత్రం అస్సలు తగ్గడం లేదు.
తాను క్రమశిక్షణ కుమార్ పేరు అని చెప్పుకునే మోహన్ బాబు .. ఆ క్రమశిక్షణ తన కొడుకులకు మాత్రం అందించలేకపోయారు అనేది ప్రస్తుతం జోరుగా సాగుతున్న చర్చ. దీనికి ముఖ్య కారణం ప్రస్తుతం మంచు కుటుంబం ఆస్తి వివాదాలంటూ.. మనస్పర్ధలు అంటూ రోడ్డుకి ఎకడమే. ఇండస్ట్రీలో మోహన్ బాబుకి చాలామంది భయపడతారు.. దీనికి ముఖ్య కారణం ఆయనకి కోపం వస్తే కొడతారు అనే మాట. చాలా సందర్భాలలో ఇది జరిగింది కూడా.
అయితే తాజాగా తన తండ్రి తనని కొట్టాడు అంటూ మనోజ్ పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం మంచు ఫ్యామిలీని కాంట్రవర్సీకి కేంద్ర బిందువుగా మార్చింది. అయితే ప్రస్తుతం ఇటు మంచు విష్ణు, అటు మంచు మనోజ్ వరుస ప్లస్ కాన్ఫరెన్స్ లతో ఒకరిపై ఒకరు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ రెచ్చిపోతున్నారు. మంచు విష్ణు తనకు అనువుగా ఉన్న బౌన్సర్లను రక్షణకు పెట్టుకుంటే.. మంచు మనోజ్ తన బౌసర్లతో గొడవకు వెళ్ళాడు. ఇలా ఇద్దరి మధ్య జరిగిన పరస్పర గొడవ చిలికి చిలికి గాలి వానగా మారింది.
ఈ విషయంలో అన్నదమ్ములు ఇద్దరికీ కమిషనర్ నుంచి విడివిడిగా వార్నింగులు కూడా వెళ్లాయి. అయితే ఈలోపే మోహన్ బాబు చేతిలో జర్నలిస్టుకి గాయం కావడంతో తెలివిగా తనకి కూడా గాయాలయ్యాయని ఆసుపత్రిలో చేరి మోహన్ బాబు కోర్టు ద్వారా తనకొక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక మంచి కుటుంబానికి ఉన్న మేజర్ ఆస్తి విద్యానికేతన్ సంస్థ.. ప్రస్తుతం ఇది మంచు విష్ణు ,అతని భార్య చేతుల్లో ఉంది. మరోపక్క మనోజ్ తనకి ఆస్తులు అవసరం లేదని.. విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం కోసం పోరాడుతున్నానని మీడియా ముందు మాట్లాడుతున్నాడు. అయితే మొత్తానికి ఈ గొడవల వల్ల సాధించేది ఏమీ లేదు అనే విషయం అందరికీ అర్థమవుతుంది.. అయితే మంచి ఫ్యామిలీ తమ కుటుంబ కలహాలను ఓవర్ పబ్లిసిటీ ఇవ్వకుండా సొంతంగా సాల్వ్ చేసుకుంటే బాగుంటుంది అని అందరూ భావిస్తున్నారు.