ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలైన చిత్రం పుష్ప 2. ఓపక్క కలెక్షన్స్ పరంగా దంచి కొడుతున్న ఈ చిత్రం రికార్డులు సృష్టిస్తోంది.. అయితే ఇదే మూవీ అల్లు అర్జున్ కి ఎన్నో కాంట్రవర్సీలు తెచ్చిపెడుతోంది. సంధ్య థియేటర్లో జరిగిన అపశృతి కారణంగా అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం.. అనంతరం జరిగిన వివాదం అందరికీ తెలిసిందే. పుష్ప 2 స్పెషల్ షో సందర్భంగా ఏర్పడిన ఈ గందరగోళంలో.. జరిగిన తొక్కేసలాటలో ఓ మహిళ మృతి చెందగా.. ఆమె బిడ్డ ఇప్పటికీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఈ ఘటన అనంతరం బాధ్యత కుటుంబానికి అల్లు అర్జున్ తో పాటు చిత్ర బృందం కూడా అండగా ఉంటాము అని హామీ ఇచ్చారు. అయితే అనుకోకుండా ఈ ఘటనలో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఇక ఆ తర్వాత జరిగిన డ్రామా అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్టుపై కొన్ని ప్రధానమైన డౌట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. వాటిలో ఓ రెండు లెటర్లు ఎక్కువగా హైలైట్ అవుతున్నాయి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాం..
ప్రస్తుతం అల్లు అర్జున్ నిరపరాధి అని.. అనవసరంగా అతని అరెస్టు చేసి ఇబ్బంది పెట్టారు అని కొందరు వాదిస్తున్నారు. అయితే మరికొందరు చట్టానికి ఎవరూ అతీతులు కారని.. తప్పు ఎవరి వల్ల జరిగిన అరెస్టు చేయడం కరెక్ట్ అని మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో రెండు లేఖలు చక్కర్లు కొడుతున్నాయి.. ఇందులో ఒకటి సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ పోలీసు బందోబస్తు కోసం రాసిన లేక.. మరొకటి పోలీసుల నుంచి వచ్చింది అని చెబుతున్న లేఖ. ఈ రెండిటినీ పరిశీలిస్తే తేడా స్పష్టంగా కనిపిస్తోంది.
సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్.. లెటర్ హెడ్ మీద.. స్పెషల్ షోకు పుష్ప 2 చిత్ర బృందం వస్తున్నారు.. కాబట్టి పోలీసులు అధిక బందోబస్తు ఇవ్వవలసిందిగా కోరుతూ రాశారు. ఇంకొకటి మామూలు తెల్ల కాగితం మీద పోలీసులు సహాయాన్ని తిరస్కరిస్తూ రాసిన లేఖ. అయితే ఈ లేక ఎటువంటి అధికారిక లెటర్ హెడ్ పై లేకపోవడం పలు అనుమానాలకి దారితీస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ లెటర్ నిజమా.. కాదా అన్న విషయంపై చర్చలు జరుగుతున్నాయి. అల్లు అర్జున్ అభిమానులు ఈ లేఖను తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు.