2024 సంవత్సరం పూర్తి కావస్తోంది.. ఇక కొత్త సంవత్సరంతో పాటు సరికొత్త సినిమాల సందడి కూడా ప్రారంభం కాబోతోంది. సంక్రాంతి బరిలో దిగడానికి స్టార్ హీరోల సినిమాలు పోటీ పడుతున్నాయి. ఇక ఈ సంవత్సరం విడుదలైన సినిమాలలో బ్లాక్బస్టర్ లిస్ట్ కెక్కిన చిత్రాల సంఖ్యా భారీగానే ఉంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఎన్నో బడా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్రహ్మాండమైన కలెక్షన్స్ తమ సొంతం చేసుకున్నాయి..
ఈ సంవత్సరం భారీ విజయాన్ని అందుకున్న కల్కి 2808 AD, పుష్ప 2 వంటి చిత్రాలు వేయి కోట్లు దాటి కలెక్షన్స్ను వసూలు చేశాయి.ఇక పుష్ప అయితే సౌత్ లోనే కాక నార్త్ లో కూడా విపరీతమైన కలెక్షన్స్ వసూలు చేసింది.అయితే తక్కువ బడ్జెట్ తో విడుదలైన ఒక చిత్రం అనూహ్యమైన కలెక్షన్స్ సొంతం చేసుకొని ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటుంది. బడా సినిమాలను పక్కకు నెట్టి బ్లాక్ బస్టర్ హిట్ నెంబర్ వన్ స్థానాన్ని ఈ చిత్రం కైవసం చేసుకుంది.
ఆ మూవీ మరేదో కాదు ఈ సంవత్సరం విడుదలైన మలయాళీ చిత్రం మంజుమ్మల్ బాయ్స్. ఈ మూవీ పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చేది గుణా కేవ్స్.. ఎందుకంటే అక్కడ ఎప్పుడో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్రమే ఇది. ఈ మూవీ మలయాళం లోనే కాక తెలుగులో కూడా ఘన విజయాన్ని అందుకుంది. కేవలం 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా 240 కోట్ల వసూళ్లు రాబట్టి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.
టూర్ కి వెళ్ళిన స్నేహితులలో ఒకరు అనుకోకుండా లోయలో పడిపోతే అతని కాపాడడం కోసం అతని మిత్రులు పడే ఆవేదనే ఈ చిత్రం. గుణ కేవ్స్ లో ప్రమాదంలో చిక్కుకున్న తమ ఫ్రెండ్ ని కాపాడడానికి ఆ స్నేహితులు ఎలాంటి రిస్క్ తీసుకున్నారు.. దానివల్ల వాళ్ళ జీవితంపై తరువాత ఎలాంటి ప్రభావం పడింది అన్న విషయాన్ని ఈ సినిమాలో అద్భుతంగా తెరకెక్కించారు. అద్భుతమైన కథతో.. ఆకట్టుకునే కథనంతో ప్రేక్షకులను మెప్పించిన ఈ చిత్రం ఏకంగా 12 రెట్ల లాభాన్ని సొంతం చేసుకుంది. భారీ బడ్జెట్ చిత్రాలు భారీ విజయాన్ని సాధించినా.. వాటి బడ్జెట్ ముందు అవి సాధించిన విజయం సరిపోతుంది. కానీ ఈ మూవీ మాత్రం దానికి డిఫరెంట్ గా 20 కోట్ల బడ్జెట్ తో 240 కోట్లు రాబట్టి.. ఈ సంవత్సరం బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల లిస్టులో ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది.