తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎటువంటి పాత్రనైనా అద్భుతంగా పోషించగలిగే హీరోయిన్ ఎవరు అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు అనుష్క. స్టార్ హీరోలతో సమానంగా స్క్రీన్ పై అద్భుతమైన నటన కనబరిచి అందరినీ ఆకట్టుకునే స్వీటీ డెడికేషన్ ఎలాంటిదో అందరికీ తెలుసు. ప్రతి సినిమాలో ఎంతో వైవిధ్యమైన నటన కనబరిచే అనుష్క ఇప్పుడు తాజాగా ఘాటి అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అనుష్క చిత్రానికి పుష్ప రాజ్ కి మధ్య పోలికలు పెడుతున్నారు నెటిజన్స్. ఇంతకీ ఆ సంగతులు ఏమిటో తెలుసుకుందాం పదండి..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ వరల్డ్ వైడ్ ఎటువంటి ఆదరణ అందుకుంటుందో అందరికీ తెలుసు. రికార్డ్ లెవెల్ కలెక్షన్స్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్న ఈ మూవీలో పుష్ప రాజ్ మేనరిజం ఎందరినో మెప్పించింది. శేషాచలం అడవుల్లో కూలీగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి ఎర్రచందనం సిండికేట్ కు అధిపతిగా ఎదిగిన పుష్ప రాజ్ స్టోరీ భారీ విజయాన్ని అందుకుంది. ఇక సెకండ్ పార్ట్ లో అతను ఏకంగా రాష్ట్ర సీఎంనే మార్చే స్థాయికి ఎదిగాడు. ఇక ప్రస్తుతం అనుష్క నటిస్తున్న ‘ఘాటీ’ చిత్రంలో కూడా ఇలాంటి పాయింటె ఉంది అన్న టాక్ నడుస్తోంది.
అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వ బాధ్యతలు వహిస్తున్నారు. ఓ బాధితురాలు నేరస్తురాలుగా మారి తన జీవితంలో అన్యాయం చేసిన వారిపై ఎలా పగ తీర్చుకుంటుంది అనే కోణంలో ఈ కథ సాగుతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన అనుష్క ఫస్ట్ లుక్ మాస్ మానియా తెప్పిస్తోంది. గిరిజన యువతి పాత్రలో అనుష్క అద్భుతంగా నటించింది. ఓ గిరిజన యువతి తనకు జరిగిన అన్యాయంపై పగ తీర్చుకుంటూ నేర సామ్రాజ్యాన్ని రూల్ చేసే ఓ మహారాణిగా ఎలా ఎదిగింది అనేది ఈ మూవీలో మెయిన్ పాయింట్ అట.
అంటే ఒకరకంగా తీసుకుంటే పుష్పరాజు లైఫ్ కి అనుష్క లైఫ్ ఈ మూవీలో పార్లర్ గా ఉంటుంది అనుకోవచ్చు. ఈ మూవీ టీజర్ లో అనుష్క మాస్ అవతార్ ఎంత వైలెంట్ గా ఉందో.. ఆమె బస్సులో ఒకరి పీకప్ పరాపరా కోస్తున్నప్పుడే అర్థమవుతుంది. అనుష్క మేనరిజం కూడా పుష్ప రాజ్ కి చాలా దగ్గరగా కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు ఈ రెండు సినిమాలను తెగ పోల్ చేస్తున్నారు నెటిజెన్లు.