లేడీ ఓరియంటెడ్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన నటి లేడీ సూపర్ స్టార్ నయనతార. బాక్సాఫీస్ వద్ద ఆమె సినిమాలు హీరోల సినిమాలతో దీటుగా కలెక్షన్స్ రాబట్టే స్టామినా కలిగి ఉంటాయి. ఇప్పటికే ఎన్నో లేడీ ఓరియంటెడ్ సినిమాలు తీసి సూపర్ డూపర్ హిట్లు అందుకున్న నయనతార మరొకసారి ప్రేక్షకుల ముందుకు విభిన్నమైన కథతో రావడానికి సిద్ధంగా ఉంది. తాజాగా ఆమె జవాన్ చిత్రంతో బాలీవుడ్ లో కూడా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ వెజ్ ఏర్పరచుకుంది.
ఎప్పటికప్పుడు వరుస చిత్రాలతో దూసుకుపోతున్న ఈ సీనియర్ హీరోయిన్ మరొకసారి రికార్డ్ బ్రేకింగ్ డైరెక్టర్ తో తన సరికొత్త సినిమాకి జత కట్టబోతోంది. ఈ కాంబినేషన్ సెట్ అయితే ఇక మరొక భారీ సక్సెస్ ఆమె ఖాతాలో పడ్డట్టే అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇప్పటికే కోలీవుడ్ లో ఏ లేడీ ఓరియంటెడ్ సినిమా తీయాలి అన్న డైరెక్టర్ ఫస్ట్ ఛాయిస్‌గా నయనతార మారింది. అంతేకాదు నయనతార నటించింది అంటే ఆ మూవీ ఖచ్చితమైన హిట్ అని ఇండస్ట్రీలో బలంగా నమ్ముతారు.
వేరే సినిమాల వల్ల బిజీగా ఉన్న తన డేట్స్ కోసం ఎదురుచూసిన దర్శకులు కూడా ఉన్నారు. తాజాగా విజయ్ సేతుపతి నటించిన మహారాజా చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ ఇప్పుడు నయనతారతో ఓ లేడీ ఓరియంటెడ్ మూవీ చేయడానికి సిద్ధమవుతున్నారు అని కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ధనుష్ కాంట్రవర్సీ విషయంలో నయనతార ఎన్నో విమర్శలు ఎదుర్కొంటోంది.
ప్రస్తుతం నయనతార చుట్టూ ఉన్న కాంట్రవర్సీలు అన్నీ సద్దుమనగాలి అంటే ఆమె నెక్స్ట్ మూవీ భారీ విజయాన్ని అందుకోవాలి.ఈ నేపథ్యంలో ఆమె ఖాతాలో ఓ భారీ సక్సెస్ పడడం ఎంతో ముఖ్యం.అందుకే మహారాజా లాంటి సూపర్ డూపర్ మూవీని తెరకెక్కించిన నిథిలన్తో కలిసి నయనతార మూవీ చేస్తే తిరిగి ఆమె మళ్ళీ ఫామ్ లోకి వస్తుందని ఆమె అభిమానులు ఆశపడుతున్నారు.