టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అనేక మంది స్టార్ హీరోలు ఉన్నారు. వీరు చేసే సినిమాలు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకొని సక్సెస్ సాధిస్తాయో కొన్ని సందర్భాలలో వాళ్లు మాట్లాడే మాటలు అంతకంటే ఎక్కువ కాంట్రవర్సీకి దారితీస్తాయి. చాలా మంది హీరోలు ప్రశంసలతో పాటు విమర్శలూ కూడా ఫేస్ చేస్తారు.అయితే, ఈ ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు మాత్రం హేటర్స్ లేకుండా ప్రశంసలు పొందుతూ, వివాదాలకు దూరంగా ఉంటూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు.
వివాదాలకు దూరంగా ఉన్న హీరోలు ఎవరో ఓ లుక్ వేద్దాం పదండి..
టాలీవుడ్‌లో వివాదాల నుంచి పూర్తిగా దూరంగా ఉండి ప్రశాంతంగా తమ కెరీర్‌ను కొనసాగిస్తున్న ముగ్గురు హీరోలు మహేష్ బాబు, ప్రభాస్, వెంకటేష్. వీరు తమ కూల్ నేచర్, ఫ్యాన్ ఫాలోయింగ్, విజయాలతో ప్రత్యేక గుర్తింపు పొందారు.
వెంకటేష్
మూవీ మొఘల్ రామా నాయుడు వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన టాలీవుడ్ స్టార్ హీరో దగ్గుబాటి వెంకటేష్ వివాదాలకు దూరంగా తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌కు ప్రాధాన్యతనిచ్చే ఈ హీరో మూడు దశాబ్దాలుగా విజయవంతంగా తన కెరీర్‌ను నిలబెట్టుకున్నారు. తన సహజమైన నటనతో పాటు వ్యక్తిత్వం కారణంగా ప్రతి ఒక్కరితో సరదాగా కలిసిపోయే స్వభావం వెంకటేష్‌కు ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి పేరు తెచ్చిపెట్టింది.
ప్రభాస్
రెబల్ స్టార్ కృష్ణం రాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి ప్రవేశించిన ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. “బాహుబలి” ,”సాలార్” వంటి భారీ విజయాల తర్వాత, ప్రభాస్ తన క్రేజ్‌ను అంతకంతకూ పెంచుకుంటూ వస్తున్నారు. వ్యక్తిగతంగా చాలా ప్రశాంతంగా ఉండే ప్రభాస్ వివాదాలకూ, నెగటివిటీకి దూరంగా ఉంటారు. అందుకే అభిమానులు అతన్ని ముద్దుగా డార్లింగ్ అని పిలుస్తారు.
మహేష్ బాబు
సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన మహేష్ బాబు, తన ఫ్యాన్ బేస్‌ను నెమ్మదిగా .. స్థిరంగా పెంచుకుంటూ వస్తున్నారు. అందరితో సాన్నిహిత్యంగా ఉంటూ, వివాదాలకు దూరంగా తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్నారు. ఇండస్ట్రీలో మహేష్ బాబుకి సెలబ్రిటీలో కూడా అభిమానులుగా ఉన్నారు అనడంలో ఎటువంటి డౌట్ లేదు.ప్రస్తుతం మహేష్ రాజమౌళి దర్శకత్వంలో ఉన్న భారీ చిత్రంపై దృష్టి పెట్టారు.
ఈ ముగ్గురు హీరోలు తమ సక్సెస్‌ఫుల్ కెరీర్‌తో పాటు, వివాదాలకు దూరంగా ఉండటం ద్వారా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపును పొందారు.