సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో “లేడీ సూపర్ స్టార్” అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు నయనతార. చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించిన ఆమె, తన నటనతో కోలీవుడ్ బాక్సాఫీస్‌ను దున్నే స్థాయికి చేరుకుంది. కమర్షియల్ సినిమాలతో పాటు, సోలో ప్రాజెక్టులలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచిన నయన్..తన సినిమాలు వస్తున్నాయంటే స్టార్ హీరోలు కూడా వెనక్కి తగ్గే రేంజ్‌కు వెళ్లిపోయింది. అయితే, నయనతార తన సినిమాల కంటెంట్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టడం వల్లే ఆమె కెరీర్ ఇంత బలంగా కొనసాగుతోంది.
మిగతా హీరోయిన్లతో పోలిస్తే నయనతార ప్రత్యేకత ఆమె కథల ఎంపికలోనే స్పష్టమవుతుంది. ఇటీవల విడుదలైన ‘జవాన్’ సినిమాతో బాలీవుడ్‌లో కూడా హిట్ అందుకున్న నయన్, అక్కడి క్రేజీ ఆఫర్లను కాదనడం విశేషం. ఇక నయనతార నిర్మాతగా కూడా తన ముద్ర వేయాలని ఫిక్స్ అయ్యిందని సమాచారం. ఆమె రౌడీ పిక్చర్స్ బ్యానర్ ద్వారా మరిన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులను ప్రొడ్యూస్ చేయాలని చూస్తోంది.
తాజాగా, రౌడీ పిక్చర్స్ బ్యానర్‌లో కోలీవుడ్ మాస్ డైరెక్టర్ హరి దర్శకత్వంలో ఓ భారీ సినిమా ప్లాన్ జరుగుతుందట. ఈ సినిమాలో మక్కల్ సెల్వన్..విజయ్ సేతుపతి లీడ్ రోల్‌లో నటించబోతున్నారని టాక్. ఇప్పటికే హరి, విజయ్ సేతుపతి మధ్య కథా చర్చలు పూర్తయ్యాయని, నయన్ కూడా ఈ సినిమాకి ఎలాంటి బడ్జెట్ అయినా వెనకడుగు వేయడం లేదని సమాచారం.
విజయ్ సేతుపతి కూడా సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు. “మహారాజ” వంటి చిత్రాలతో తన బాక్సాఫీస్ స్టామినాను ప్రూవ్ చేసిన విజయ్, రీసెంట్‌గా “విడుదల 2″తో కూడా మంచి గుర్తింపు అందుకున్నాడు. హరి దర్శకత్వంలో విజయ్ సేతుపతి కొత్తగా చేయబోయే ఈ ప్రాజెక్ట్ మాస్ యాక్షన్ అంశాలతో ఉండబోతోందని సమాచారం. కథ అద్భుతంగా కుదిరిందని, ఇది విజయ్ సేతుపతికి మరో బ్లాక్‌బస్టర్ అవుతుందని అంచనా వేస్తున్నారు. మరి నయన్ ప్రొడ్యూస్ చేసే ఈ సినిమా ఎలాంటి మైలురాయిగా నిలుస్తుందో చూడాలి.