యాంకర్ శ్యామల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె తన కార్యక్రమాల ద్వారా కాకుండా, పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యల వలన ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. ముఖ్యంగా గత ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతూ చేసిన వ్యాఖ్యలు ఆమెను సోషల్ మీడియాలో చర్చకు కేంద్రంగా నిలిపాయి. పవన్ కళ్యాణ్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, “తాను ఎప్పుడూ ఆయనతో సహాయపడినట్లు చూడలేదని, వినలేదని” అన్న ఆమె వ్యాఖ్యలు పవన్ అభిమానులను తీవ్రంగా నొప్పించాయి. ఆమె జగన్ విజయం గురించి ధీమాగా మాట్లాడినప్పటికీ, పవన్ కళ్యాణ్ అభిమానులు ఆమెపై విమర్శలు గుప్పించారు.
పవన్ కళ్యాణ్ విజయంతో ఆమెకు పరిస్థితి తారుమారైంది. పవన్‌ను విమర్శించిన వారిపై అభిమానులు విమర్శల జడివాన కురిపించారు. శ్యామల ఈ దాడులతో ఇబ్బంది పడుతూ, ఓ వీడియోలో తనపైన చేస్తున్న దాడులు ఆపాలని వేడుకోవాల్సి వచ్చింది. అందులో తన మాటలు ఎవరికైనా అన్యాయం చేశాయేమో అనుకుంటూ క్షమాపణలు చెప్పింది. ఈ ఘటనతో ఆమె కొంత కాలం సైలెంట్‌గా ఉంది.
అయితే, తాజాగా గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తరువాత రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించడంతో ఆమె మళ్లీ చర్చకు వచ్చింది. ఈ సంఘటనను ఆధారంగా చేసుకుని పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేసింది. ఆమె మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి తమ కార్యక్రమాల ద్వారా యువతను రెచ్చగొడుతున్నారనే విమర్శలు చేసింది. రెండు ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనను రాజకీయం చేస్తున్నారని, పవన్ తన బాధ్యతలను నిర్లక్ష్యం చేశారని ఆమె ఆరోపించింది.
పుష్ 2 మూవీ స్పెషల్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కసేలాట్లు ఓ మహిళ చనిపోయిన ఘటన ఎంత వైరల్ అయిందో అందరికీ తెలుసు. ఇక ఈ కేస్ విషయంలో అల్లు అర్జున్ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మనం చూస్తూనే శ్యామల ప్రస్తుతం
అల్లు అర్జున్ కేసును ఈ రోడ్డు ప్రమాదానికి లింక్ చేసి.. ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఇక దీనిపై మెగా అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.