రాజమౌలి మూవీ కోసం చైనా లో మహేష్ స్పెషల్ ట్రైనింగ్

0

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్ర‌స్తుతం ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తో క‌లిసి ఎస్ఎస్ఎంబీ 29 మూవీ తో ఫుల్ బిజీగా ఉన్నారు . ఈ సినిమా ఓ అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కుతున్నందున మహేష్ బాబు వివిధ రకాల ప్రత్యేక శిక్షణలు తీసుకుంటున్నారు. ఇటీవలే జపాన్ వెళ్లి కొన్ని ప్రత్యేకమైన శిక్షణలు పూర్తి చేసిన మహేష్, ఆపై ఆఫ్రికాలోని మ‌సాయి, పిగ్మీస్ తెగ‌ల మ‌ధ్య 20 రోజుల పాటు బేసిక్ ట్రైనింగ్ పొందారు. ఈ శిక్షణ మహేష్ పాత్రకు గట్టి బలం చేకూరుస్తుందని చెబుతున్నారు.

తాజాగా, మహేష్ బాబు చైనా ప్రయాణం చేయనున్నట్లు సమాచారం. ఈ నెల మ‌ధ్య‌లోనే మహేష్ చైనా వెళ్లి మార్ష‌ల్ ఆర్ట్స్ పై ప్రత్యేక శిక్షణ పొందనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. చైనాలో ప్రముఖ నిపుణుల శిక్షణ కేంద్రంలో ఈ శిక్షణ జరగనుంది. మహేష్‌తో పాటు రాజమౌళి కూడా ఆ శిక్షణను పర్యవేక్షించనున్నారని తెలుస్తోంది. మార్ష‌ల్ ఆర్ట్స్ మాస్టర్లు మహేష్ బాబుకు ఈ శిక్షణ అందించనున్నారు.

ఈ సినిమాలో మహేష్ పాత్రను స్ట్రాంగ్ గా మలిచేందుకు రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రత్యేక శిక్షణా పద్ధతులను ఎంచుకుంటున్నారు. మహేష్ బాబు తన మూవీస్ లో పాత్ర కోసం ఎలాంటి రిస్క్ ఆయినా తీసుకుంటారు అనే విషయం మరోసారి స్పష్టమవుతోంది. జపాన్, ఆఫ్రికా వంటి చోట్ల శిక్షణ పొందిన మహేష్ బాబు ఇప్పుడు చైనా కు కూడా ట్రైనింగ్ కు వెళ్తున్నారు అనే వార్త, ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

ఈ సినిమా ప్రధానంగా ఆఫ్రికా అడవుల్లో తెరకెక్కనుంది. అలాగే, హైదరాబాద్‌లో రామోజీ ఫిల్మ్ సిటీతో పాటు పలు భారీ సెట్లు కూడా నిర్మిస్తున్నారని సమాచారం. ఇప్పటి వరకు మహేష్ బాబుకు అందిస్తున్న శిక్షణలు ఈ సినిమా ప్రాముఖ్యతను చెప్పకనే చెబుతున్నాయి. ఇన్ని శిక్షణా కార్యక్రమాలను పూర్తి చేయడం చాలా ఓర్పు ఉండటం తో పాటు , కష్టనష్టాలను అధిగమించే నేర్పు కూడా ఉండాలి. మహేష్ బాబు మాత్రం తన పనిపై పూర్తిగా నిబద్ధతతో ఉంటారని మరోసారి నిరూపిస్తున్నారు.

ప్రస్తుతం మహేష్ బాబు చైనా ట్రిప్ గురించి వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా పూర్తయిన తర్వాత మహేష్ బాబు ప్రేక్షకులను కొత్త అవతారంలో మెప్పిస్తారని అందరూ ఆశిస్తున్నారు.