అల్లు అర్జున్ హీరోగా నటించిన “పుష్ప 2: ది రూల్” సినిమా ప్రపంచవ్యాప్తంగా విశేష విజయం సాధించింది. ఈ సినిమా మొత్తం రూ.1800 కోట్ల గ్రాస్ వసూలు చేసి భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక కొత్త చరిత్రను సృష్టించింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, అల్లు అర్జున్ కెరీర్‌లోనే అత్యున్నత స్థాయి గుర్తింపును తీసుకొచ్చింది. “పుష్ప 1: ది రైస్” విడుదలయ్యాకే ఇండస్ట్రీను షేక్ చేసిన ఈ సిరీస్ రెండో భాగం కూడా అదే స్థాయిలో అంచనాలను అందుకుని, దానికి మించిన విజయం సాధించడం విశేషం.
ఈ సినిమా హిందీ బెల్ట్‌లో సాధించిన ఆదరణ నిజంగా చరిత్రాత్మకం. హిందీ వెర్షన్‌లో “పుష్ప 2” 4 కోట్ల ఫుట్‌ఫాల్స్‌ను నమోదు చేసింది. ఇది పాన్ ఇండియా స్థాయిలో అత్యున్నత హిందీ సినిమాల జాబితాలో మొదటి స్థానాన్ని పొందింది. గతంలో సన్నీ డియోల్ నటించిన “గదర్ 2” హిందీలో 3.4 కోట్ల ఫుట్‌ఫాల్స్‌తో రికార్డు సాధించింది. అయితే, “పుష్ప 2” ఆ రికార్డును బ్రేక్ చేయడం విశేషం. అలాగే, షారుక్ ఖాన్ “జవాన్” 3.1 కోట్ల ఫుట్‌ఫాల్స్‌తో, “పఠాన్” 2.8 కోట్ల ఫుట్‌ఫాల్స్‌తో నిలిచినప్పటికీ, “పుష్ప 2” ఆ సంఖ్యలను దాటింది.
అల్లు అర్జున్ తన ఊరమాస్ నటన, డ్యాన్సులు, సుకుమార్ టేకింగ్, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాను ప్రత్యేకంగా నిలిపాయి. హిందీ ప్రేక్షకులు “పుష్ప” సిరీస్‌ను ఎంతో ప్రేమగా ఆదరించారు. “పుష్ప 1: ది రైస్” కూడా ఉత్తరాది మార్కెట్‌లో 1.31 కోట్ల ఫుట్‌ఫాల్స్‌ను నమోదు చేసి, రెండో భాగానికి బలమైన పునాది వేసింది. “పుష్ప 2” మాత్రం ఈ స్థాయిని మరింత బలపరచి ఉత్తరాది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.
ఈ సినిమా భారతీయ చిత్ర పరిశ్రమలో భారీ స్థాయిలో వసూళ్లను సాధించి, పాన్ ఇండియా సినిమాల రేంజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. “పుష్ప 2” విడుదల తర్వాత వచ్చిన స్పందన చూస్తే, ఇది బాహుబలి, గదర్ లాంటి సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తూ ముందుకెళ్లడం ప్రత్యేకం. ఈ సినిమా సక్సెస్‌తో అల్లు అర్జున్ తన నటనా ప్రస్థానంలో చరిత్ర సృష్టించారు.
సరైన కథ, పవర్‌ఫుల్ స్క్రీన్‌ప్లే, ప్రేక్షకులను ఆకట్టుకునే దృశ్యాలు, భారీ యాక్షన్ , సెంటిమెంట్.. ఇలా అన్ని అంశాలు కలబోసిన “పుష్ప 2” విజయానికి మూల కారణం. ఈ సినిమా సాధించిన ఘనత అల్లు అర్జున్ స్టార్‌డమ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం మాత్రమే కాకుండా, భారతీయ సినిమా గొప్పతనాన్ని ప్రపంచానికి చూపించింది.