పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఓజీ ట్రీట్ అప్పుడే

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పవన్ రాజకీయాలలో బిజీగా ఉన్న కారణంగా కొంత ఆలస్యం అయినా, ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం 15 రోజులు మాత్రమే షూటింగ్ పనులు మిగిలి ఉంది. త్వరలో ప్రొడక్షన్ టీమ్ పవన్ కళ్యాణ్ డేట్స్ ఫిక్స్ చేయాలని చూస్తుంది. సంక్రాంతి పండగ తర్వాత పవన్ ఈ చిత్రానికి జాయిన్ అయ్యే అవకాశముందని సమాచారం.

ఈ సినిమాను జూలైలో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. కళకత్తా నేపథ్యంతో సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఒక భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌. థమన్ సంగీతం అందిస్తుండగా, ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌ ఫ్యాన్స్‌లో భారీ ఆసక్తిని రేపింది. ఇక టీజర్‌ను సంక్రాంతి కానుకగా విడుదల చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. 1:39 నిమిషాల నిడివి గల ఈ టీజర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.

మేకర్స్ ఈ సినిమాను పార్ట్ 1, పార్ట్ 2గా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. “అలాంటోడు మళ్లీ వస్తున్నాడు” అనే లైన్‌తో సినిమాకు అవసరమైన హైప్‌ను పెంచేశారు. మొదటి భాగం విజయవంతమైతే, రెండో భాగం మరింత గ్రాండ్‌గా ఉండబోతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మంగళగిరి పరిసరాల్లో ఆరు ఎకరాల స్థలంలో భారీ సెట్‌లను నిర్మిస్తున్నారు. ఈ సెట్‌లను పార్ట్ 2లో ఉపయోగించనున్నారు.

‘ఓజీ’ సినిమాలో పవన్ పాత్రను ఫ్యాన్స్ ఎంతో ప్రత్యేకంగా భావిస్తున్నారు. ఈ పాత్రను మరింత శక్తివంతంగా చూపించేందుకు మేకర్స్ ప్రణాళికలు చేస్తున్నారట. ఫ్యాన్స్ అందరూ పార్ట్ 2 పై వచ్చే అధికారిక అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్, రాజకీయంగా ఎంత బిజీగా ఉన్నా, తన లైనప్‌లో ఉన్న సినిమాలను వీలైనంత త్వరగా పూర్తి చేసి, ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘ఓజీ’ లాంటి పాన్-ఇండియా సినిమా మరోసారి పవన్ కెరీర్‌లో మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.