యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలో యాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలుసు. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటన అద్భుతం.ఇక ఈ మూవీ లో ఎన్టీఆర్ పాత్రను రాజమౌళి మలిచిన తీరు ,
తారక్ పాత్రకు ఇచ్చిన ఎలివేషన్ కు ప్రేక్షకులను ఫిదా అయ్యారు. అల్లూరి సీతారామరాజు పాత్రతో పోలిస్తే కొమరం భీమ్ పాత్ర కొంత సున్నితంగా కనిపించినప్పటికీ, తారక్ నటన, ఎనర్జీ ఆ పాత్రకు ప్రత్యేకమైన శక్తిని ఇచ్చాయి. తారక్ ఎంట్రీ, బ్రిడ్జ్ ఫైట్ సీక్వెన్స్, అడవి మృగాలతో దాడి చేసే సన్నివేశాలు ఆయన ఇమేజ్ను భారీగా పెంచాయి.
కానీ, క్లైమాక్స్‌లో భీమ్ పాత్రను కొంత నీరసంగా చూపించడంతో అభిమానుల్లో అసంతృప్తి తలెత్తింది. తారక్ హై ఎనర్జీని ఫుల్‌గా వినియోగించుకోలేక పోయారన్న భావన ప్రేక్షకుల్లో కనిపించింది. ఆ సినిమా తర్వాత తారక్ కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘దేవర’ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తారక్ ఇమేజ్‌కు సరిపోయే ఎలివేషన్ సన్నివేశాలు లేకపోవడం వల్ల సినిమా డివైడ్ టాక్‌ను మూటగట్టుకుంది. కొరటాల శివ తారక్ యొక్క హై ఓల్టేజ్ ఎనర్జీని సరిగ్గా మేనేజ్ చేయలేకపోయారనే విమర్శలు వచ్చాయి.
ఇప్పుడు ఆ లోటును ప్రశాంత్ నీల్ పూడ్చుతారని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా ‘డ్రాగన్’ అనే పాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆయన గత చిత్రాలైన ‘కేజీఎఫ్’లో యశ్, ‘సలార్’లో ప్రభాస్ పాత్రలను ఎంత బలంగా తీర్చిదిద్దారో తెలిసిందే. కథా నేపథ్యం ఎంత పట్టు చూపినా, హీరో పాత్రను ప్రతీ సీన్లో మెమోరబుల్‌గా మలిచే విషయంలో ప్రశాంత్ స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్నారు.
తారక్‌ను కూడా అదే స్థాయిలో చూపిస్తారని భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా మయన్మార్-భూటాన్ నేపథ్యంతో సాగుతుందనే ప్రచారం ఉంది. ఆ నేపథ్యానికి తగినట్లు తారక్ పాత్రను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. విజువల్స్, హీరో ఎలివేషన్ విషయంలో ప్రశాంత్ నీల్ తనదైన ముద్ర వేస్తారని అభిమానులు నమ్ముతున్నారు. రాజమౌళి తర్వాత తారక్ ఇమేజ్ను ప్రశాంత్ మరో స్థాయికి తీసుకెళతారనే ఆశతో ‘డ్రాగన్’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.