
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కలిసి చేస్తున్న సినిమా గురించి సోషల్ మీడియాలో భారీ హైప్ నెలకొంది. మహేష్ బాబుతో సినిమా తీయడానికి రాజమౌళి చేసిన ప్లానింగ్ చూస్తే అందరికీ ఆశ్చర్యం కలుగుతోంది. ఈ సినిమా కోసం అద్భుతమైన ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని టాక్. బడ్జెట్ విషయంలోనూ భారీగా ఖర్చు పెడుతున్నారని, దాదాపు 1000 కోట్లు వెచ్చిస్తున్నట్లు సమాచారం. ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీగా రూపొందనున్న ఈ సినిమాలో మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా ఫైనల్ అయినట్టు ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే మహేష్ బాబుతో రాజమౌళి వర్క్‌షాప్ ప్రారంభించినట్టు సమాచారం. ఈ సినిమా గురించి ఎలాంటి లీకులు బయటకు రాకుండా జక్కన్న కఠిన చర్యలు తీసుకున్నాడు. లొకేషన్లో హీరో సహా ఎవరూ ఫోన్లు వాడకూడదని స్పష్టమైన నిబంధనలు పెట్టారు. సినిమా కథకు సంబంధించిన విషయాలు బయటకు రావొద్దనే ఉద్దేశంతో టీమ్‌ను పూర్తిగా తన కంట్రోల్లో ఉంచుకున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది.
ఆ తర్వాత చిత్రబృందం విజయవాడ సమీపంలో వేసిన ప్రత్యేకమైన సెట్లో చిత్రీకరణ జరుపుకోనుందని టాక్. అంతేకాదు, సినిమా షూటింగ్ కోసం కెన్యా అడవుల్లో కూడా కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు ప్లాన్ చేశారని సమాచారం. లొకేషన్ల ఎంపికలో రాజమౌళి మరోసారి తన స్టైల్‌ను చూపిస్తున్నాడు. ఈ మూవీ అంతర్జాతీయ స్థాయిలో సెట్ అవ్వడానికి పెద్ద స్కెచ్ వేసినట్టు అనిపిస్తోంది. అయితే, ప్రస్తుతానికి సినిమా గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండా అన్ని విషయాలను గోప్యంగా ఉంచారు.
ఇక్కడ షూటింగ్ పూర్తయిన తర్వాత రాజమౌళి గ్రాండ్‌గా ప్రెస్ మీట్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నాడట. ఆ సందర్భంగా సినిమాలో నటించే ఇతర నటీనటులు, టెక్నీషియన్లు, ఇతర ముఖ్యమైన వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఈ సినిమా కోసం మహేష్ బాబు తన కష్టమైన మూడు సంవత్సరాల టైమ్ కేటాయించినట్టు తెలుస్తోంది. ఇక, సినిమాను 2027లో థియేటర్లలోకి తీసుకురావాలని దర్శకుడు రాజమౌళి గట్టిగా నిర్ణయించుకున్నట్టు సమాచారం.
ఇందులో ప్రియాంక చోప్రా ఉండడం ఈ సినిమాకు గ్లోబల్ రేంజ్లో ప్రాముఖ్యతను తీసుకురావొచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే ‘RRR’ సినిమాతో ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి, మహేష్ బాబుతో చేస్తున్న ఈ సినిమాతో మరో మెట్టుపైకి వెళ్లేలా ఉన్నాడు. మహేష్, రాజమౌళి కాంబినేషన్ చాలా ఏళ్లుగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంబో. ఎట్టకేలకు ఈ కలయిక నిజమవుతుండటంతో అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి.
ఈ సినిమా ఏ రేంజ్లో విజయం సాధిస్తుందో చూడాలి, కానీ ఇప్పటివరకు అందిన సమాచారం చూస్తే అద్భుతమైన సినిమా అవ్వబోతుందనే నమ్మకంతో ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు. మహేష్-రాజమౌళి కాంబినేషన్ అంతటా సంచలనానికి కేరాఫ్‌గా మారే అవకాశం ఉంది.