
తండేల్ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. నాగ చైతన్య కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా, వారం రోజులు గడిచినా అదే జోరు కొనసాగిస్తోంది. వాలెంటైన్స్ వీకెండ్‌కి కొన్ని కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చినప్పటికీ, తండేల్పై వాటి ప్రభావం ఏమాత్రం కనిపించకపోవడం విశేషం. కొత్త సినిమాలు వచ్చినా, రీ-రిలీజ్ మూవీస్ ప్రేక్షకులను ఆకర్షించినా, తండేల్ మాత్రం టిక్కెట్ బుకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతూ బాక్సాఫీస్‌పై దుమ్మురేపుతోంది.
ఈ వీకెండ్‌కి విడుదలైన లైలా, బ్రహ్మానందం వంటి సినిమాలు తమ స్థాయిలో టిక్కెట్లు అమ్ముకోవడానికి ప్రయత్నించాయి. అయితే, వీటన్నింటినీ తండేల్ కనీసం రెండింతల రేంజ్లో డామినేట్ చేయడం గమనార్హం. వారం గడిచినా సినిమా స్టడీగా ఉండడం విశేషం. లైలా సినిమా రెండో రోజున కేవలం 7,000 టిక్కెట్లు మాత్రమే అమ్ముకోగా, బ్రహ్మానందం మూవీ 8,000 టిక్కెట్లు సేల్స్ రాబట్టింది. అలాగే, రీ-రిలీజ్ అయిన ఆరెంజ్ సినిమా 7,500 టిక్కెట్లు అమ్ముకుంది. కానీ అదే సమయంలో, తండేల్ మాత్రం 53,000 టిక్కెట్లు అమ్ముతూ మిగతా అన్ని సినిమాలను దారుణంగా త్రిప్పకొట్టింది. కేవలం వసూళ్ల పరంగానే కాదు, ప్రేక్షకుల ఆదరణ పరంగా కూడా తండేల్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.
శుక్రవారం నుంచి శనివారానికి గరిష్ట స్థాయిలో వృద్ధి కనబరిచిన ఈ సినిమా, ఆదివారం భారీ కలెక్షన్లను రాబట్టే అవకాశముంది. సినిమా ఫ్లోను చూస్తే ఈ నెలాఖరు వరకూ బాక్సాఫీస్‌పై రాజ్యం వహించేలా ఉంది. నాగ చైతన్యకు వరుస పరాజయాల తరువాత ఇది ఓ గట్టి కమ్‌బ్యాక్ అని చెప్పొచ్చు. విడుదలకు ముందే బుజ్జి తల్లి, హైలెస్సా పాటలు ట్రెండింగ్‌లో ఉండటం, సినిమాపై అంచనాలను పెంచింది. నాగ చైతన్య – సాయి పల్లవి జంట, చందు మొండేటి టేకింగ్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.
ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఈ సినిమా బాగా కనెక్ట్ అవ్వడంతో వీకెండ్ మాత్రమే కాకుండా వర్కింగ్ డేస్‌లోనూ మంచి కలెక్షన్లను రాబట్టే అవకాశాలున్నాయి. నెక్స్ట్ రోజుల్లో తండేల్ ఏ స్థాయిలో కొనసాగుతుందో చూడాలి. రీ-రిలీజ్ సినిమాలు, కొత్త సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో నిలదొక్కుకోలేకపోతున్నా, తండేల్ మాత్రం మాస్ ఆడియన్స్‌ను పూర్తిగా ఆకర్షిస్తోంది. ఈ హవా ఇలాగే కొనసాగితే, త్వరలోనే టాలీవుడ్లో ఓ కొత్త ట్రెండ్‌ను సెట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.