
జానీ మాస్టర్ టాలీవుడ్ లో ఓ ప్రముఖ కొరియోగ్రాఫర్ గా గుర్తింపు పొందారు. ఆయన ఎంతో మంది స్టార్ హీరోలకు డాన్స్ కంపోజ్ చేసి, తన ప్రత్యేకమైన స్టైల్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఎన్నో హిట్ సాంగ్స్ కి కొరియోగ్రఫీ అందించి మంచి పేరు తెచ్చుకున్నారు. తమిళ్ లో ఆయన కంపోజ్ చేసిన ఓ పాటకు జాతీయ అవార్డు రావడం విశేషం. అయితే, ఆ అవార్డును అందుకునే సమయంలోనే ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దాంతో, ఆయన అరెస్టయ్యి దాదాపు నెలరోజుల పాటు జైలులో గడిపారు. ఇటీవలే బెయిల్ పై విడుదలై తిరిగి తన కెరీర్ పై దృష్టిపెట్టారు.
ఈ కేసు టాలీవుడ్ ను కుదిపేసింది. జానీ మాస్టర్ పై వచ్చిన ఆరోపణలు నిజమేనా కాదా అనే చర్చ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసును దాఖలు చేసిన శ్రేష్ట వర్మ గతంలో ఢీ షో కంటెస్టెంట్ గా, పుష్ప సినిమాకు కొరియోగ్రాఫర్ గా పని చేశారు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి విచారణ కొనసాగగా, మాస్టర్ ఒక నెల జైలులో ఉన్న తర్వాత విడుదలయ్యారు.
అయితే, తాజాగా ఈ కేసు మరో కొత్త మలుపు తిరిగింది. సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం, శ్రేష్ట వర్మ ఇప్పుడు మతం మార్చుకుని జానీ మాస్టర్ ని పెళ్లి చేసుకోవాలని భావిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె తల్లి కూడా మతపెద్దలతో మాట్లాడి రెండో పెళ్లి కోసం ఏర్పాట్లు చేస్తుందని టాక్. కొరియోగ్రాఫర్ అయిన మరో వ్యక్తి కూడా ఇదే విషయాన్ని బయటపెట్టినట్టు ప్రచారం జరుగుతోంది.
ఈ పరిణామాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఒకవేళ శ్రేష్ట నిజంగా జానీ మాస్టర్ ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటే, గతంలో ఆమె పెట్టిన కేసు ఏమవుతుంది? ఆమె ఆరోపణలు నిజమా, లేక వెనుక ఏదైనా మరో కథ ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనాలు మాస్టర్ చెప్పినదానిని నమ్మాలా, లేక శ్రేష్ట చెప్పినదానిని నమ్మాలా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారు.
ఇప్పటికైతే ఈ వ్యవహారం పూర్తిగా క్లారిటీ రావాల్సి ఉంది. జానీ మాస్టర్ ఈ విషయం పై ఎలా స్పందిస్తారు, ఆయన రెండో పెళ్లి చేసుకుంటారా లేదా అన్నది కూడా తెలియాల్సిన అంశమే. కానీ, ఒకవేళ శ్రేష్ట వర్మ నిజంగానే మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని అనుకుంటే, ఆమె గతంలో చేసిన ఆరోపణలు ఎంతవరకు నిజమన్నదానిపై ఇండస్ట్రీలో మరోసారి చర్చ మొదలయ్యే అవకాశముంది. ఈ కేసు ఫైనల్ గా ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.