ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ కు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. నిన్న మొన్నటిదాకా నాగచైతన్య ,సమంత డైవర్స్ గురించి మాట్లాడుకున్న అందరూ.. ఇప్పుడు నాగచైతన్య ,శోభిత ధూళిపాల పెళ్లి గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. అయితే వీటి మధ్యలో తాజాగా అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ జరిగినట్టుగా నాగార్జున సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలియపరచారు.
మొదట అఖిల్ పెద్ద క్రికెటర్ అవుతారు అని అందరూ భావించారు తర్వాత సడన్గా హీరోగా ఎంట్రీ ఇచ్చి అందరిని సర్ప్రైజ్ చేశాడు.సిసింద్రీ అనే మూవీ తో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి భారీ విజయాన్ని అందుకున్న అఖిల్ ఆ తరువాత హీరోగా మారిన సక్సెస్ సాధించలేకపోయాడు. అఖిల్ అనే మూవీ తో అతను ఇచ్చిన ఎంట్రీ ఓ పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత అతని నటించిన మజ్ను, హలో లాంటి సినిమాలు పరవాలేదనిపిచ్చుకున్నాయి. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం మాత్రమే అతనికి కాస్త సక్సెస్ను అందించింది.
ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన అఖిల్ ఏజెంట్ చిత్రం భారీ డిజాస్టర్ గా మారింది. దీంతో అప్పటినుంచి అఖిల్ ఇప్పటివరకు మరేచిత్రం చేయలేదు. గతంలో అఖిల్ కు ఎంగేజ్మెంట్ జరిగి ఆగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా అఖిల్ దుబాయ్ కి చెందిన మోడల్ జైనబ్ రావ్ జీ ను ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అని అధికారికంగా ప్రకటించారు.
దీంతో అక్కినేని అభిమానులు అసలు ఆ అమ్మాయి ఎవరో అంటూ ఇంటర్నెట్లో తెగ వెతికేశారు. వీటన్నిటి మధ్యలో ఓ సూపర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ బయటపడింది. అఖిల్ కంటే కూడా జైనబ్ సుమారు 9 సంవత్సరాలు వయసులో పెద్ద అనే విషయం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఇక ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజెన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. కొందరైతే ఈ విషయంలో అఖిల్ సచిన్ రికార్డుని కూడా బద్దలు కొట్టేశాడు అని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు ఏదో ఒకటి ఈసారైనా ఎంగేజ్మెంట్ పెళ్లి పీటల వరకు వెళ్తే చాలు అని అంటున్నారు.