సీరియస్ పాత్రలతో ఆకట్టుకుంటున్న అల్లరి నరేష్, కొత్తగా ‘బచ్చలమల్లి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గోదావరి జిల్లా నేపథ్యంగా సాగిన ఈ కథలో మల్లినేని (అల్లరి నరేష్) అనే యువకుడు తండ్రి చేసిన తప్పుతో పెరిగిన ద్వేషం వల్ల తన జీవితం ఎలా మారిపోయిందో ఈ మూవీలో అద్భుతంగా చూపించారు.
కథ ఫస్ట్ పార్ట్ లో తండ్రీ-కొడుకుల అనుబంధాన్ని బలంగా తెరకెక్కించారు. మల్లి, తండ్రి చేసిన తప్పును మన్నించలేక, చెడు వ్యసనాలకు బానిసవుతాడు. అతనిలో మార్పు రావడానికి కావేరి (అమృత అయ్యర్) పాత్ర కీలకంగా నిలుస్తుంది. అయినప్పటికీ, కథ సెకెండ్ హాఫ్ లో స్టోరీ అనుకున్నంత ఆసక్తికరంగా సాగకపోవడం ప్రేక్షకులను బాగా నిరాశకు గురిచేస్తుంది.
సినిమా మొదటి భాగంలో కొన్ని హార్డ్ హిట్టింగ్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అయితే, ద్వితీయార్థంలో స్టోరీలో బాగా ల్యాగ్ ఉండడంతో కాస్త బోరింగ్ అనిపిస్తుంది. ముఖ్యంగా హీరో-విలన్ మధ్య కన్ఫ్లిక్ట్ బలహీనంగా ఉండడం, విలన్ పాత్రకు లోపించిపోయిన ఎమోషన్ కూడా కథనాన్ని తగ్గించింది.
ఇక ఈ మూవీలో అల్లరి నరేష్ తన నటనతో మరోసారి మెప్పించాడు. రావు రమేష్, రోహిణి, జయరాం పాత్రలు కూడా ఆకట్టుకున్నాయి. విశాల్ చంద్రశేఖర్ సంగీతం సన్నివేశాలకు ఎంతో డెప్త్‌ని అందిస్తూ బలం చేకూర్చినప్పటికీ, పాటలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.
డైరక్టర్ ఈ మూవీలో కథను ఎన్నో కీలక సన్నివేశాలతో చాలా ఎమోషనల్ గా డిజైన్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ అనుకున్నంత రిజల్ట్ రాలేదు. స్టోరీలో గ్రిప్టింగ్ లేకపోవడంతో అక్కడక్కడ సన్నివేశాలు సినిమాకి అతికించినట్లుగా ఉన్నాయి. కొన్ని ఎపిసోడ్లు మరీ బలహీనంగా.. అసలు సినిమాకి అవసరమా అనిపించేలా ఉన్నాయి. కానీ ఓవర్ ఆల్ గా బచ్చల మల్లి ఓ డీసెంట్ మూవీ అని చెప్పవచ్చు.
రేటింగ్: 2.5/5