ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ చూసినా పుష్ప మానియా గట్టిగా కనిపిస్తోంది.. రేపు ప్రీమియం షోలు పడతాయి.. ఇక ఎల్లుండి ఈ మూవీ భారీగా విడుదల కాబోతోంది.. ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా ఈ చిత్రానికి సంబంధించిన ఏదో ఒక అప్డేట్ వైరల్ అవుతుంది. తాజాగా పుష్ప టు సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ తండ్రి.. అల్లు అరవింద్ చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్లో నిర్వహించిన పుష్ప 2 ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సినీ ప్రముఖులు, దర్శకులు, నిర్మాతలు.. భారీగా తరలివచ్చారు. ఇక ఈ ఈవెంట్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న అల్లు అరవింద్ సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఈ చిత్రాన్ని ఒక వారం రోజుల క్రితం అల్లు అరవింద్ చూశారట.. ఇక దీనిపై ఆయన అనుభవాలను వివరించారు.
“మూవీ చూసి ఎంతో ఆనందంగా ఇంటికి వచ్చిన నన్ను నా భార్య.. ఏంటి మొహమలా వెలిగిపోతోంది? అని ప్రశ్నించింది.. ఇప్పుడే సినిమా చూసి వచ్చాను చాలా బాగుంది అని ఆమెకు సమాధానం చెప్పాను.. అయితే ఆ తర్వాత ఆమె చెప్పిన మాట నా మనసులో అలాగే ఉండిపోయింది.. ఈరోజు ఆ మాట మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను..’మగధీర సినిమా తర్వాత ఇప్పుడు మీ ముఖంలో ఇంత వెలుగు చూస్తున్నాను ‘అని నా భార్య నాతో అంది..”అని అల్లు అరవింద్ పేర్కొన్నారు..
అంతేకాదు ఐదు సంవత్సరాలుగా ఈ పాజిటివ్ పిచ్చోళ్ళని భరిస్తున్న స్నేహ, భవితకు అవార్డులు కూడా ఇవ్వాలి అన్నారు అల్లు అరవింద్. ఇక ఈ మూవీ హీరోయిన్ రష్మిక గురించి ఓ రేంజ్ లో పొగిడేసారు.. గీతా గోవిందం చిత్రంతో తన టాలెంట్ను ప్రూవ్ చేసుకున్న రష్మిక ఇప్పుడు ఈ సినిమాలో తన నటనతో ఎక్కడికో వెళ్లిపోయిందని మెచ్చుకున్నారు. అలాగే శ్రీలీల అది తక్కువ టైంలోనే ఈ మూవీలో తన పర్ఫామెన్స్ తో అదరగొట్టింది అని పేర్కొన్నారు.
ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఎంతోప్లస్ అవుతుందని.. ఇన్ని సంవత్సరాలుగా ఈ ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతూ వరుస హిట్స్ అందుకుంటున్న అతనికి తండ్రి ఆశీర్వాదాలు బలంగా ఉన్నాయని పేర్కొన్నారు అరవింద్. ఈ మూవీలో పనిచేసిన ప్రతి ఒక్కరు ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేశారని మెచ్చుకున్నారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్యానర్గా ఎదుగుతుందని.. నవీన్, రవి శంకర్, చెర్రీ ఎంతో సమిష్టిగా పనిచేసే సక్సెస్ సాధిస్తున్నారని మెచ్చుకున్నారు. పుష్ప2 చిత్రం భారీ విజయాన్ని సాధిస్తుంది అని కాన్ఫిడెంట్ గా చెప్పారు అల్లు అరవింద్.