పుష్ప మూవీ తో సౌత్ హీరోలు ఎవ్వరు సాధించలేని విధంగా నార్త్ లో సంచలన విజయాన్ని నమోదు చేసుకున్నాడు అల్లు అర్జున్. దీంతో అతని రాబోయే నెక్స్ట్ పుష్ప 2 మూవీ నార్త్ ఇండియాలో బాక్సాఫీస్లో కొల్లగొట్టిన ఆశ్చర్యం లేదు అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ లో బరిలోకి దిగుతున్న ఈ చిత్రం విడుదల తర్వాత బాక్సాఫీస్ ని షేర్ చేయడం కన్ఫామ్. 12 వేల స్క్రీన్ లతో భారీ టికెట్ ధరలతో విడుదలవుతున్న ఈ చిత్రం మొదటి రోజు 300 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుంది అని అభిమానులు ఆశిస్తున్నారు.
తాజాగా జరిగిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా భారీగా జనాలు తరలివచ్చారు. అయితే ఈ ఈవెంట్లో అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు మాత్రం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాయి.. “పుష్ప మూవీ వచ్చిన తర్వాత అందరూ దాని సీక్వెల్ ఎలా ఉంటుంది అని అనేవారు. అసలు కథ కూడా వినకుండానే నేను పుష్ప 2 లో తగ్గేదే లేదు అని చెప్పుకుంటూ వచ్చేవాడిని. అయితే నిజంగా నేను అనుకున్న దానికంటే అద్భుతంగా ఆ చిత్రాన్ని తెరకెక్కించడంలో సహాయం చేసిన ఎందరికో ఈరోజు ఈ వేదిక పైనుంచి నేను కృతజ్ఞతలు చెబుతున్నాను.
పుష్ప అనేది మీకు ఒక సినిమా కావచ్చు.. కానీ అందులో పని చేసిన ప్రతి ఒక్కరికి ఐదు సంవత్సరాల జర్నీ.. అది మాకు ఒక ఎమోషన్ లాంటిది. మరి ముఖ్యంగా నేను రష్మిక తో ఈ ఐదు సంవత్సరాలు కలిసి పని చేశాను.. నిజంగా తను ఒక అద్భుతమైన నటి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక పుష్ప 2 లో స్టోరీ మీకు ఎన్నో ట్రస్టులతో మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అని ఆశిస్తున్నాను.
అర్ధరాత్రి రెండు గంటల వరకు షూటింగ్లో పాల్గొని కూడా మరుసటి రోజు పొద్దున 8 గంటలకి సెట్లో రెడీగా ఉండేది. ఎంత స్ట్రెస్ లో ఉన్నా సరే ఆమె యాక్షన్ లో ఎటువంటి తేడా కనిపించేది కాదు.. నిజంగా ఒక స్టార్ హీరోయిన్ కి ఉండాల్సిన అన్ని క్వాలిటీసు రష్మికలో ఉన్నాయి. ఇక శ్రీనిల డాన్స్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు.. ఆమె ఒక అద్భుతమైన నటి. ఇక సుకుమార్ లేకపోతే పుష్పరాజు లేడు.. ఇప్పుడు కూడా ప్రమోషన్స్ కంటే కూడా సినిమాని ద బెస్ట్ గా చేయాలి అనే ఉద్దేశంతో తపిస్తున్నాడు మా డైరెక్టర్. ఇక ఫాహద్ ఫజిల్ ఈ పార్టీలో తన విశ్వరూపాన్ని చూపించాడు.”అంటూ ఈ ఐదు సంవత్సరాల తన పుష్ప జర్నీని అందరితో పంచుకున్నాడు బన్నీ.