ప్రస్తుతం సోషల్ మీడియాలో పుష్ప కు సంబంధించిన వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. కొందరు ఈ సినిమా గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతుంటే మరికొందరు సినిమాలో అక్కడక్కడ ఉన్న చిన్న చిన్న లోపాలను భూతద్దంలో పెట్టి పెద్దవి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పుష్ప మూవీకి సంబంధించిన ఒక డైలాగ్ పై సోషల్ మీడియాలో కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
గత కొద్ది కాలంగా తిరుమల శ్రీవారి లడ్డుపై మన రాష్ట్ర రాజకీయాలలో ఎటువంటి కాంట్రవర్సీ నడుస్తుందో అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో పుష్పటులో తిరుమల లడ్డు గురించి ప్రస్తావిస్తూ వచ్చే ఓ డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలే వివాదాస్పదమైన అంశం అయినా లడ్డు గురించి సుకుమారి ఎందుకు తన సినిమాలో మెన్షన్ చేశాడో ఎవరికీ అర్థం కావడం లేదు.
ప్రస్తుతం సాగుతున్న మెగా వెర్సెస్ అల్లు వార్ నేపథ్యంలో.. తిరుమల లడ్డు డైలాగ్ అల్లు అర్జున్ చెప్పడం భవిష్యత్తులో ఎటువంటి కాంట్రవర్సీలకి దారితీస్తుందో అర్థం కావడం లేదు. ఒకరకంగా చూస్తే అల్లు అర్జున్ తిరుపతి లడ్డు గురించి చాలా గొప్పగానే చెప్పాడు.. కానీ అవతల వాళ్ళు దానిపై ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.
సినిమాలో ఓ ఢిల్లీ లీడర్ తో ఫోన్లో మాట్లాడుతున్న సమయంలో పుష్పరాజ్..”నేను తిరుపతి లడ్డు లాంటోని..”అని అంటాడు. శ్రీవారి భక్తులు పరమ పవిత్రంగా భావించే లడ్డుని ఇలా డైలాగ్ లో వాడడం వివాదానికి దారి తీసే అవకాశం ఉంది. పైగా మరీ ముఖ్యంగా స్టోరీలో హీరో చేసేది ఎర్రచందనం స్మగ్లింగ్.. మాఫియా.. అలాంటివాడు తనని తాను లడ్డుతో పోల్చుకోవడం.. కొందరి మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉంది.
తాజాగా సూపర్ డూపర్ సక్సెస్ సాధించిన సత్యం సుందరం మూవీ రిలీజ్ టైం లో తమిళ్ స్టార్ హీరో కార్తీ లడ్డు గురించి మాట్లాడిన దానిపై పవన్ కళ్యాణ్ ఏ రేంజ్ లో ఫైర్ అయ్యారు అందరికీ తెలుసు. అప్పట్లో చాలా సెన్సేషనల్ గా ఉన్న లడ్డు టాపిక్ గురించి ప్రస్తావించినప్పుడు..”ఎప్పుడు ఆ సెన్సిటివ్ టాపిక్ గురించి ఎందుకు?”అని అన్నందుకే కార్తీ ని చెడుగుడు ఆడేశాడు పవన్.. మరి ఇప్పుడు తరలి తాను లడ్డుతో పోల్చుకున్న పుష్పరాజు విషయంలో మన డిప్యూటీ సీఎం ఎలా రియాక్ట్ అవుతాడు అనేది సర్వత్ర ఆసక్తి రేపుతోంది..