2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ కోసం ప్రచారానికి రాకుండా తన మిత్రుడు నంద్యాల అభ్యర్థి కోసం అల్లు అర్జున్ వెళ్లడం ఎన్నో రకాల వివాదాలకు తావిచ్చింది. ఇక అప్పటినుంచి మెగా వెర్సెస్ అల్లు వార్ ఓ రేంజ్ లో షురూ అయింది. అసలు వాళ్ళ సంగతి తెలియదు కానీ.. అభిమానులు మాత్రం సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు సెటైర్ల వర్షం కురిపించారు. పలు రకాల మీమ్స్ తో ఇరు వర్గాలు ఎప్పుడూ ఏదో ఒక హల్చల్ చేస్తూనే ఉన్నాయి.
ఎన్నో రోజుల నుంచి మెగా ఫాన్స్ ఎదురుచూస్తున్న మాట అల్లు అర్జున్ నోటి నుంచి రానే వచ్చింది.. “కళ్యాణ్ బాబాయ్.. థాంక్యూ సో మచ్”అని అల్లు అర్జున్ ఎట్టకేలకు అన్నాడు. దీంతో మెగా అభిమానులు కాస్త సంతోషించిన.. మరి కొందరు ఇది కావాలని అల్లు అర్జున్ అనుకున్న మాట అని భావిస్తున్నారు. నిజానికి పుష్ప ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు ఫ్యామిలీ కటౌట్ ఏ రేంజ్ వివాదానికి దారితీసిందో అందరికీ తెలుసు.
ఆ ఈవెంట్ లో ఎక్కడ మెగా వారి గురించి అల్లు అర్జున్ మాట్లాడకపోవడం కూడా పవన్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ప్రస్తుతం ఈ ఇద్దరి అభిమానుల మధ్య వార్ పీక్ స్టేజ్ లో ఉండడంతో.. సముదాయించే బాధ్యత అల్లు అర్జున్ వహిస్తున్నట్లు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి అతను మాట్లాడడం ఇన్ డైరెక్ట్ గా మాకు మాకు మధ్య ఏమీ లేదు దయచేసి మీరు కూడా కొట్టుకోకండి అని అభిమానులకు కన్వె చేస్తున్నట్లు అందరూ భావిస్తున్నారు.
అయితే పుష్ప 2 మూవీకి భారీ రేట్లు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు కాబట్టే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని పొగుడుతున్నారు.. అంతేకానీ అంతకుమించి ఏమీ లేదు అన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది. అలాగే అల్లు అర్జున్ తన మనసుకు నచ్చినట్లు ప్రవర్తిస్తాడు.. పవన్ కళ్యాణ్ గురించి ఇప్పుడు అతను ప్రస్తావించడం కూడా అలాంటిదే అని అతన్ని సమర్థిస్తున్నారు అల్లు ఆర్మీ. మరి ఇప్పటికైనా ఆన్లైన్లో జరుగుతున్న ఈ వివాదాలు తగ్గుతాయా లేక మరింత పెరుగుతాయా అన్న విషయం చూడాలి.