పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా పుష్ప థియేటర్ వద్ద చోటుచేసుకున్న ఓ ఘటన కారణంగా అల్లు అర్జున్ పై కేసు నమోదైన విషయం అందరికీ తెలిసిందే. ఈ కేసు విషయంలో కొద్దికొద్దిగా మార్పులు కనిపిస్తున్నాయి. బన్నీకి ఇప్పటికే కోర్టు అనేక కండిషన్లతో రెండోసారి కూడా బేలు మంజూరు చేసింది. ఇక తాజాగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మరణించిన రేవతి కొడుకు.. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీ తేజను కలవడానికి పోలీసులు బన్నీకి అనుమతిచ్చారు.
అల్లు అర్జున్, సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ తర్వాత నుంచి శ్రీతేజ్ ను కలవాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అయితే, లీగల్ కారణాల వల్ల, బన్నీ గతంలో శ్రీతేజ్ ను కలవలేకపోయాడు. కొన్ని రోజుల క్రితమే, ప్రెస్ మీట్ లో కూడా అల్లు అర్జున్ ఈ విషయం తెలియజేసినాడు. తాను శ్రీతేజ్ ను పరామర్శించాలనుకుంటున్నాను కానీ, లీగల్ టీమ్ ఆదేశం మేరకు కలవకూడదు అన్న నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నాడు. కోర్టు, విచారణ అనంతరం, సాక్షులను ప్రభావితం చేయకుండా ఉండాలని, అలాగే కేసు మీద ఎక్కువగా మాట్లాడకూడదని సూచించింది.
తాజాగా, పోలీసులు బన్నీకి శ్రీతేజ్ ను కిమ్స్ ఆస్పత్రిలో పరామర్శించడానికి కొన్ని షరతులతో అనుమతి ఇచ్చారు. ఈ అనుమతి కింద, అల్లు అర్జున్ ఎప్పుడు శ్రీతేజ్ ను కలవడానికి వస్తారో, ఆ సమయాన్ని ముందుగా పోలీసులకు తెలియచేయాల్సి ఉంటుంది. పోలీసులకు ముందే సమాచారం ఇచ్చినప్పుడు మాత్రమే బందోబస్త్ చేయగలమని, తెలియచేయకపోతే పూర్తి బాధ్యత బన్నీదే అని నోటీసుల్లో పేర్కొనడం జరిగింది.
ఈ అనుమతి తరువాత, బన్నీ ఎప్పుడు శ్రీతేజ్ ను పరామర్శించడానికి ఆస్పత్రికి వెళ్ళడో, అది రహస్యంగా ఉండాలని పోలీసుల ఆదేశాలు ఉన్నాయని తెలుస్తోంది. బన్నీ, రేవతి కుమారుడు శ్రీతేజ్ ను పరామర్శించడానికి త్వరలో వెళ్ళే అవకాశం ఉంది. ప్రస్తుతం, శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నాడు.
ఈ పరిస్థితుల్లో, అల్లు అర్జున్ శ్రీతేజ్ కి మద్దతు ఇస్తూ, హాస్పిటల్ ఖర్చులన్నీ కూడా భరించడం కొనసాగిస్తున్నాడు. శ్రీతేజ్ తండ్రి కూడా ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే, బన్నీ ఎప్పుడు పరామర్శకు వెళ్ళిపోతాడో, తదుపరి పరిస్థితులు ఏంటో, అది ఆసక్తికరంగా మారింది.