ప్రశాంత్ కిషోర్.. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో ఈ పేరు గురించి తెలియని వారు ఉండరు. గెలుపు గుర్రం ఎవరు ఎక్కుతారు అనే విషయం ఎలా తెలుస్తుందో కానీ వాళ్లతో కలిసి ఫోటోలు దిగడం.. ఆ గెలుపుకి తానే కారణం అన్నట్టు సెల్ఫ్ మార్కెటింగ్ చేసుకోవడం లో ప్రశాంత్ కిషోర్ సిద్ధహస్తుడు. అందుకే ఎప్పుడు ఎక్కడ కనిపించాలో అతనికి తెలిసినట్టుగా ఎవ్వరికీ తెలియదు.
అయితే గత కొద్దికాలంగా ప్రశాంత్ కిషోర్ పేరు పెద్దగా వినిపించడం లేదు. ఇక దీనికి తోడు అందరూ గెలుపు ఓటముల గురించి జోష్యాలు చెప్పే అతగాడి అభ్యర్థులు మాత్రం బీహార్లో పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు. దాంతో నిన్న మొన్నటి వరకు అతనికి ఉన్న బజ్ ఇప్పుడు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో సెలబ్రిటీని ప్రశాంత్ కిషోర్ కలిసినట్టుగా కాసిఫ్ వైరల్ అయింది.
ఆ సెలబ్రిటీ మరెవరో కాదు.. అల్లు అర్జున్. ఇక దీంతో కొన్నాళ్లు ప్రజాసేవ.. తర్వాత రాజకీయం.. అంటూ బన్నీని టార్గెట్ చేస్తూ ఎన్నో కథలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. కొన్ని వర్గాలు బన్నీ స్వయంగా ప్రశాంత్ కిషోర్ ని కలిశాడు.. అతనికి రాజకీయాలపై ఏదో ఆలోచన ఉంది అంటూ పలు రకాల విమర్శలు చేశాయి.
ఈ నేపథ్యంలో గతంలో చంద్రబాబు నాయుడు విషయంలో ప్రశాంత్ కిషోర్ లీకులపై మరొకసారి డిస్కషన్ జరుగుతోంది. రాజకీయాలలో పండిపోయిన చంద్రబాబుకి ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తి సారథ్యం అవసరం లేదు. అంతగా మాట్లాడితే చంద్రబాబు వ్యూహరచన ముందు ప్రశాంత్ కిషోర్ అసలు సెట్ కూడా కాదు. కానీ 2024 ఎన్నికలకి ముందు ఏర్పోర్ట్ లో ఒకసారి చంద్రబాబును కలిసిన ప్రశాంత్ కిషోర్ ఫోటో తెగ వైరల్ అయింది. అయితే అప్పట్లో కావాలని ప్రశాంత్ కిషోర్ ఇలా లీక్ ఇచ్చుంటాడు అన్న అనుమానాలు కూడా తలెత్తాయి.
ఇప్పుడు కూడా అదే రకంగా ఢిల్లీకి వచ్చిన బన్నీని ఏదో ఒక మూల ఎయిర్పోర్ట్లో కలిసి షేక్ అందించిన ప్రశాంత్ కిషోర్.. ఆ తర్వాత తనకు సానుకూలమైన మీడియాలకు ఆ ఫోటోలు లీక్ ఇచ్చి ఉండవచ్చు.. ప్రస్తుతం బన్నీ నేషనల్ క్రేజ్ ఉన్న హీరో కాబట్టి.. మరొకసారి ఈ నెపంతో అందరి దృష్టిని ఆకర్షించవచ్చు అని ప్రశాంత్ ట్రై చేస్తున్నాడు అని అందరూ భావిస్తున్నారు.