పుష్ప 2 మూవీతో అదిరిపోయే కలెక్షన్స్ సాధించడమే కాకుండా ఎన్నో రికార్డులను తిరగ రాసిన అల్లు అర్జున్ అనుకొని సంఘటన కారణంగా నిన్న అరెస్టుకు గురి అయ్యారు. సినిమా విడుదల సందర్భంగా థియేటర్లో మూవీ చూడడానికి అల్లు అర్జున్ ఫ్యామిలీతో వచ్చినప్పుడు జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చి ఇక్కడ పల్లి పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం బండిని అదుపులోకి తీసుకున్నారు.
నాంపల్లి కోర్టులో ఈ కేసు పై విచారణ జరిగింది.. ఈ నేపథ్యంలో బన్నీకి 14 రోజుల రిమాండ్ విధించారు. బన్నీ తరపు న్యాయవాదులు కూడా హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. విచారణ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగిన తర్వాత బన్నీకి మభ్యంతర బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. అయితే బెయిల్ కాపీ సరిగ్గా లేదు అంటూ జైలు అధికారులు ఆ బెల్ ని తిప్పి కొట్టేశారు.
మరోపక్క ఆన్లైన్లో సరిగ్గా అప్లోడ్ కాలేదంటూ చాలా జాప్యం చేశారు. దీంతో రాత్రి వరకు అల్లు అరవింద్ ఎదురు చూసి విసుగు చెంది.. వెన్ను తిరిగారు. దీంతో బన్నీ రాత్రి మొత్తం స్టేషన్ లోనే గడిపాడు. స్టేషన్లో కూడా కేవలం తనని ఎప్పుడు విడుదల చేస్తారు అన్న మాట తప్ప మరి ఇంకొక మాట మాట్లాడని బన్నీ రాత్రంతా నిద్రపోకుండా అలాగే మేలుకొని ఉన్నడు.
ఈరోజు పొద్దున 6:45 నిమిషాలకు జైలు నుంచి విడుదలైన తర్వాత నేరుగా గీత ఆర్ట్స్ ఆఫీస్ కి చేరుకున్న బన్నీ అక్కడ తండ్రి తో మామతో సుదీర్ఘ చర్చలు జరిపారు. అనంతరం ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఫ్యామిలీని చూసి బన్నీ చాలా ఎమోషనల్ అయ్యాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కోర్టులో కేసు నడుస్తోందని.. కాబట్టి దాని గురించి మాట్లాడబోనని స్పష్టం చేశారు. అంతేకాదు బాధిత కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాము అని పేర్కొన్నారు.