
ఐ.ఎం.డిబి తాజాగా ఇండియన్ పాపులర్ సూపర్ స్టార్స్ లిస్ట్ విడుదల చేసింది. ఈ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిలిచాడు. ‘పుష్ప 2’ సినిమాతో నేషనల్ లెవెల్ లో బిగ్ మార్క్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్, తన మాస్ అండ్ ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో పాటు ఆయన స్టైల్, డైలాగ్స్, డాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ కలిసి దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ను పెంచాయి. దీంతో బాలీవుడ్ స్టార్స్ ని వెనక్కి నెట్టి, నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు.
అల్లు అర్జున్ తర్వాత ఈ లిస్ట్ లో సెకండ్ ప్లేస్ లో షారుఖ్ ఖాన్ ఉన్నాడు. ‘జవాన్’ ,’ పఠాన్’, ‘డంకీ’ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న షారుఖ్, తన అద్భుతమైన ఫాంను కొనసాగిస్తున్నాడు. మూడో స్థానంలో ‘కేజీఎఫ్’ స్టార్ యష్ నిలిచాడు. అతని క్రేజ్ ఇంకా కొనసాగుతుండటంతో ఈ ప్లేస్ దక్కింది. నాలుగో స్థానంలో రణ్ బీర్ కపూర్ నిలిచాడు. ఇటీవల వచ్చిన ‘ఆనిమల్’ మూవీకి ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో, ఈ ర్యాంక్ దక్కించుకున్నాడు. ఐదో స్థానంలో బాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ దేవ్ ఉన్నాడు.
ఇక టాప్ 10 లోకి వస్తే, ఏడో స్థానంలో రెబల్ స్టార్ ప్రభాస్ నిలిచాడు. ‘సలార్’ భారీ విజయంతో పాన్ ఇండియా రేంజ్ లో ప్రభాస్ క్రేజ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎనిమిదో స్థానంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చోటు సంపాదించుకున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ద్వారా ఇంటర్నేషనల్ లెవెల్ లో పేరు తెచ్చుకున్న చరణ్, ఈ ర్యాంక్ తో తన మార్క్ ప్రూవ్ చేసుకున్నాడు. టాప్ 10 లో చివరి స్థానాన్ని దళపతి విజయ్ దక్కించుకున్నాడు.
ఇక 11 నుంచి 25 ర్యాంక్స్ వరకూ చూస్తే, లెజెండరీ యాక్టర్స్ అయిన రజినీకాంత్, కమల్ హాసన్ లతో పాటు యంగ్ స్టార్ దుల్కర్ సల్మాన్ కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు. ఎన్టీఆర్ 23వ స్థానంలో, మహేష్ బాబు 25వ స్థానంలో ఉండటం మాత్రం వారి ఫ్యాన్స్ ని కొంత నిరాశపరిచింది. టాప్ 10 లో తెలుగు హీరోలు అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్ మాత్రమే ఉండగా, మొత్తం లిస్ట్ లో మాత్రం ఐదుగురు తెలుగు స్టార్స్ చోటు దక్కించుకోవడం గర్వించదగ్గ విషయం.
ఈ ర్యాంకింగ్స్ లో హీరోల సినిమాలు, వాటి ఫలితాలు, వారి సోషల్ మీడియా ఇంపాక్ట్ అన్నీ కీలక పాత్ర పోషిస్తాయి. అల్లు అర్జున్ ఈ లిస్ట్ లో నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకోవడం టాలీవుడ్ కి గొప్ప విషయం. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు హీరోల మార్కెట్ రోజురోజుకీ పెరుగుతుండటంతో, భవిష్యత్తులో మరింత మంది ఈ లిస్ట్ లో కనిపించే అవకాశం ఉంది.