ప్రస్తుతం సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పేరు మారుమోగుతోంది. తాజాగా విడుదలైన అతని చిత్రం పుష్ప 2 రికార్డ్ లెవెల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంటే మరోపక్క ఈ మూవీ చూడడానికి చిత్ర బృందం హాల్ కు వచ్చిన సందర్భంలో జరిగిన తొక్కేసలాటలో ఓ మహిళ మరణించడం.. ఆ తర్వాత అల్లు అర్జున్ పై కేసు ఫైల్ చేయడం మరింత సెన్సేషన్ ని సృష్టించింది.
సౌత్ కంటే కూడా పుష్ప2 చిత్రం నార్త్ లో ఎక్కువగా రాణిస్తోంది. ఇటీవల సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో నార్త్ ఆడియన్స్ కూడా ఎంతో ఫీలయ్యారు. ఇక ఆ విషయం కాసేపు పక్కన పెడితే అల్లు అర్జున్ అరెస్టు సమయంలో ఆయన భార్య స్నేహ ఎంత మద్దతుగా నిలిచారో అందరం చూసాం. ఇప్పుడే కాదు ఈ జంట అన్యోన్యత ఎప్పుడుకప్పుడు ఏదో ఒక రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది.
వీటన్నిటి నేపథ్యంలో మరొకసారి ఈ స్నేహ రెడ్డి గురించి ఆన్లైన్లో సర్చ్ చేసే వారి సంఖ్య పెరిగింది. సోషల్ మీడియాలో అత్యంత ప్రజాదారణ పొందిన జంటల్లో ఈ ఇద్దరి జంట ఒకటి. 2011లో అల్లు అర్జున్ స్నేహ రెడ్డి ని వివాహం చేసుకున్నాడు. స్నేహ రెడ్డి హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారవేత్త కూతురు. ఆమె తండ్రి సైంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్.ఐ.టి) చైర్మన్.
యునైటెడ్ స్టేట్స్ లో కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ అందుకున్న స్నేహ 2016లో ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ కోసం ఆన్లైన్ ఫొటోస్ స్టూడియో పికాబూను ప్రారంభించింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా కూడా ఆమెకు మంచి పేరు ఇన్స్టాల్ లో సుమారు 90 లక్షల పైగా ఫాలోవర్స్ ఉన్న స్నేహారెడ్డి ప్రకటనలకు ,పోస్టింగులకు భారీగానే పారితోషకం అందుకుంటారు.ఇక స్నేహ రెడ్డి ఆస్తులు విలువ సుమారు 42 కోట్లు ఉంటుందని అంచన. కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే మరో పక్క వ్యాపార రంగంలో కూడా స్నేహ రెడ్డి రాణిస్తోంది.