అక్కినేని కుటుంబంలో ప్రస్తుతం పెళ్లి భాజలు మోగుతున్నాయి. ఒకపక్క నాగచైతన్య షోవిత ధోళిపాల పెళ్లయితే మరో పక్క మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న అఖిల్ అక్కినేని ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ నేపథ్యంలో అమల అక్కినేని పెట్టిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
అతనిని కుటుంబానికి సంబంధించి గత కొద్దికాలంగా ఎన్ని కాంట్రవర్సీలు వచ్చాయో అందరికీ తెలుసు. మరి ముఖ్యంగా సమంత ,నాగచైతన్య విడిపోయిన తర్వాత సోషల్ మీడియా వేదికగా కొందరు నాగచైతన్యను సమర్థిస్తే మరికొందరు సమంతను సమర్థిస్తూ ఎప్పుడో జరిగిన విడాకుల్ని ఇప్పటివరకు లాగుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో నాగచైతన్య, శోభిత ధూళిపాలతో ఎంగేజ్మెంట్ గుట్టు చప్పుడు కాకుండా పూర్తిచేసుకుని పెళ్లికి కూడా ముహూర్తం పెట్టించేసుకున్నాడు.
కనీసం నాగచైతన్య, శోభిత ధూళిపాల మధ్య ఏదో నడుస్తోంది అన్న వార్తలైనా వచ్చాయి కానీ అఖిల్, జాైనబ్ ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఒక్క న్యూస్ కూడా ముందుగా బయటకు రాలేదు. ఇక నాగచైతన్య ఎంగేజ్మెంట్ విషయం కూడా తండ్రి నాగార్జున సోషల్ మీడియా వేదికగా పంచుకుంటే తెలిసింది. అయితే ఆ టైంలో అమల నుంచి ఎటువంటి పోస్ట్ రాకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
కట్ చేస్తే ఇప్పుడు తన కొడుకు ఎంగేజ్మెంట్ జరిగిన వెంటనే అమల అక్కినేని తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఓ పోస్ట్ పెట్టారు. మళ్లీ నెగటివ్ కామెంట్స్ వినాల్సి వస్తుంది ఏమో అని కామెంట్ సెక్షన్ ని ముందు జాగ్రత్తగా క్లోజ్ చేశారు. అయితే ఇప్పుడు ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ కావడంతో పాటు.. నాగచైతన్య ఎంగేజ్మెంట్ అప్పుడు ఏ పోస్ట్ పెట్టని అమల.. ఇప్పుడు తన కొడుకు ఎంగేజ్మెంట్ అప్పుడు మాత్రం పోస్ట్ పెడుతుంది.. సవతి ప్రేమ అంటే ఇదే కదా అంటున్నారు నేటిజన్స్.