తెలుగు సినీ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ఒక్క తెలుగు హీరోకి నేషనల్ అవార్డ్ రాకపోవడం ఆశ్చర్యకరం. అయితే ఆ ఘనతను సొంతం చేసుకున్న మొదటి తెలుగు హీరో అల్లు అర్జున్. ‘పుష్ప’ చిత్రంలో పుష్పరాజ్ పాత్రకు అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్ అందుకోవడం తెలుగు ప్రేక్షకులకు గర్వకారణం. అయితే, కొందరు ప్రేక్షకులు ఈ అవార్డుకు అల్లు అర్జున్ అర్హుడు కాదని సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యలు చేస్తుండడం చర్చనీయాంశమైంది.
తాజాగా బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ఈ అంశంపై స్పందిస్తూ అల్లు అర్జున్ నేషనల్ అవార్డు గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అమీర్ ఖాన్ కొన్ని విషయాల్లో ఎంత ఖచ్చితంగ ఉంటారో అందరికీ తెలుసు. దీనికి ఉదాహరణ.. గత 20 ఏళ్లుగా ఏ అవార్డ్ ఫంక్షన్‌కు హాజరు కాకపోవడమే. అవార్డులు సినిమాల కలెక్షన్ల ఆధారంగా ఇవ్వడం తనకు నచ్చదని ఆయన ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు.
అమీర్ ఖాన్ తాజాగా మాట్లాడుతూ, అల్లు అర్జున్ ‘పుష్ప’ వల్ల నేషనల్ అవార్డ్ అందుకోవడం ఆశ్చర్యంగా అనిపించిందని, ఆ అవార్డ్ ‘సర్దార్ ఉద్దమ్’ సినిమాలో విక్కీ కౌశల్‌కి రావాల్సిందని అభిప్రాయపడ్డారు. అవార్డులను యాక్టర్ల ఆర్ట్‌ను చూసి ఇవ్వకుండా ఇతర పరిమాణాలను ఆధారంగా నిర్ణయించడం సరైనది కాదని అన్నారు. అవార్డులు ప్రామాణికత కోల్పోతున్నాయని, ప్రేక్షకుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.
అమీర్ ఖాన్ అవార్డులపై ఉన్న తన నిరాకరణ గురించి 1993లో మొదలైన అనుభవాలను ప్రస్తావించారు. ‘హమ్ హై రహీ ప్యార్ కే’కు బదులుగా షారుఖ్ ఖాన్ నటించిన ‘బాజీగర్’కు అవార్డు రావడంతో అమీర్ నష్టపోయినట్లు భావించారు. అలాగే, 1995లో ‘రంగీలా’కి బదులుగా ‘దిల్వాలే దుల్హానియా లేజాయేంగే’ అవార్డు అందుకోవడంతో ఆయన మరింత నిరాశ చెందారు. సినిమా కలెక్షన్ల ఆధారంగా అవార్డులు ఇవ్వడం తన కళను నిరాకరించినట్లుగా ఫీలై, అప్పటి నుంచి అవార్డ్ ఫంక్షన్లకు దూరంగా ఉంటున్నారు.
అమీర్ ఖాన్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్ అవుతుండగా, కొందరు ఆయన అభిప్రాయాలకు మద్దతు తెలుపుతున్నారు. మరోవైపు, తెలుగు ప్రేక్షకులలో అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్‌పై నెగిటివిటీ పెరుగుతున్న సందర్భంలో అమీర్ వ్యాఖ్యలు చర్చకు మరింత ఊతమిచ్చాయి.