టాలీవుడ్ యాంకర్ కమ్ నటి అనసూయ గురించి తెలియని వారు లేరు. ఒకప్పుడు బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా స్టార్ యాంకర్‌గా గుర్తింపు పొందిన అనసూయ, ఇప్పుడు సినిమాల షూటింగ్స్‌తో బిజీగా గడుపుతోంది. సోగ్గాడే చిన్ని నాయనా మూవీ తో అనసూయ మరింత గుర్తింపు పొందింది. ఆ తరువాత సినిమాల మీద పూర్తిగా దృష్టి పెట్టిన అనసూయ, స్టార్ యాంకర్ నుంచి టాలీవుడ్ స్టార్ పాత్రల నటి వరకు ఎదిగింది.
రామ్ చరణ్ రంగస్థలం, పుష్ప 1 లాంటి చిత్రాలలో అనసూయ నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇటీవల పుష్ప2: ది రూల్ సినిమాలో కీలక పాత్రలో కనిపించిన అనసూయకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ హిట్ తర్వాత ఆమెకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. సినిమాలలో తో పాటు అనసూయ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టీవ్ గా ఉంటుంది.
సినిమాల్లో నటిస్తూనే కుటుంబానికి సమయం కేటాయించడం అనసూయ ప్రత్యేకత. తరచూ కుటుంబంతో కలిసి వెకేషన్స్‌కు వెళ్లే ఆమె, అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది. భర్త, ఇద్దరు కుమారులతో కలిసి ఆనందంగా గడుపుతున్న అనసూయ, తాజాగా తన మూడో ప్రెగ్నెన్సీ కు సంబంధించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఇప్పటికే ఇద్దరు కొడుకులకు తల్లి అయిన అనసూయ, తనకు మూడో బిడ్డ కనాలని ఉందని, అది కూడా ఆడపిల్ల కావాలని తమ మనసులోని కోరికను వెల్లడించింది. అయితే, భర్త ఈ విషయాన్ని సరదాగా తీసుకుంటున్నారని నవ్వుతూ చెప్పింది అనసూయ. ఆడపిల్ల ఎందుకు కావాలంటూ కొడుకులు సైతం ప్రశ్నించారని, దీనికి అనసూయ సమాధానమిస్తూ, ఆడపిల్ల ఉండటం కుటుంబానికి బ్యాలెన్స్ కల్పిస్తుందని చెప్పారు.
ఆడపిల్లలుండే ఇంట్లో అబ్బాయిలు ఎలా ఉండాలో నేర్చుకుంటారని ఆమె అభిప్రాయపడ్డారు.ఇల్లు అందంగా ఉండాలంటే ఆడపిల్లలు ఉండటం అవసరమని అనసూయ అభిప్రాయపడటం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె చెప్పిన ఈ వ్యాఖ్యల వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.