Saturday, July 24, 2021

అనసూయ కరెక్ట్‌ కాదు.. వేశ్య కరెక్ట్‌ కాదు

సినిమాలు అంతే.. ఒక్కోసారి లేని హైప్‌ను భారంగా మోస్తూ ముందుకెళ్లేవి కొన్ని అయితే.. కావాలని హైప్‌ను క్రియేట్‌ చేసుకుని ఆ తర్వాత చతికిల పడేవి కొన్ని. ఈ తరహా హైప్‌ క్రియేషన్‌ జిమ్మిక్కులకు అసలు వేదికలు వెబ్‌సైట్‌లు, ఛానళ్లు, ఇప్పుడు సోషల్‌ మీడియా కూడా ఇందులో వచ్చి చేరింది. సినీ జనాలు అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తమ సినిమాల్లో మాస్‌, క్లాస్‌ మెచ్చే విధంగా ఎలా జాగ్రత్తలు తీసుకుంటారో.. వార్తా సంస్థలు కూడా అన్ని వర్గాల పాఠకులను దృష్టిలో పెట్టుకుని వార్తలు వండి వారుస్తుంటాయి. ఇందులో తప్పేమీ లేదు. ఎవరి వ్యాపారాలు వారివి.

ఈ క్రమంలో కొన్ని వార్తలు కొందరిని మెప్పిస్తుంటాయి.. కొన్ని కొందరిని నొప్పిస్తుంటాయి. మెప్పించిన వారు ఆనందంతో మరో పది మందికి ఆ వార్త గురించి, వార్త రాసిన మీడియా సంస్థ గురించి గొప్పలు చెప్పుకుంటారు. అదే నెగెటివ్‌ వార్త అయితే ఇక ఆ వార్త మీద, దాన్ని ప్రచురించిన, ప్రసారం చేసిన సంస్థ మీద కారాలు, మిరియాలు నూరుతూ ఉంటారు. తాజాగా ప్రముఖ యాంకర్‌, నటి అనసూయకు సంబంధించిన ఓ వార్త టాక్‌ ఆఫ్‌ ది మీడియా అయింది.

మారుతి దర్శకత్వంలో గోపిచంద్‌ హీరోగా తెరకెక్కబోతున్న చిత్రంలో అనసూయ ఓ వేశ్య పాత్రలో నటిస్తోందనే వార్త సోషల్‌ మీడియా, ఎలక్ట్రానిక్స్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వార్త అక్కడా.. ఇక్కడా చెక్కర్లు కొట్టి మొత్తానికి యూనిట్‌ దృష్టికి వెళ్లింది. అసలు తమ చిత్రంలో నటించని నటి గురించి, తమ చిత్రంలో లేని పాత్ర గురించి ఇలా నెగెటివ్‌ వార్త చక్కెర్లు కొడుతుండడంతో దర్శకుడు మారుతి ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. మీ ఆసక్తికి ధన్యవాదాలు. మా చిత్రంలో వేశ్య వంటి పాత్ర ఏదీ లేదు. అనసూయ వంటి క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌లు చేయ దగిన హోమ్లీ పాత్ర మాత్రం ఉంది. కానీ దీనికి అనసూయను మేము ఇప్పటి వరకూ సంప్రదించలేదు అంటూ ప్రకటించారు. దీంతో అనసూయ పాత్రపై క్లారిటీ వచ్చింది.

Related Articles

Latest Articles