‘మా బాడీ.. మా ఇష్టం’.. శివాజీ వ్యాఖ్యలపై అనసూయ మండిపాటు

0

‘దండోరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. హీరోయిన్ల గ్లామర్ ప్రదర్శనపై శివాజీ వ్యాఖ్యలు వివాదాస్పదం అవడంతో పాటు అభ్యంతరకరంగా ఉన్నాయని పలువురు సినీ ప్రముఖులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అందులో ముఖ్యంగా యాంకర్, నటి అనసూయ భ‌ర‌ద్వాజ్ శివాజీ వ్యాఖ్యలని తీవ్రంగా దుయ్యబట్టారు.

ఈ మేరకు యాంకర్ అనసూయ స్పందిస్తూ.. ఇది మా శరీరం.. మీది కాదు. మాకు నచ్చినట్లే మేము ఉంటామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దుస్తులు ధరించే స్వేచ్ఛ ప్రతిఒక్కరికీ ఉంటుందని అనసూయ గతంలోనే అనేక మార్లు చెప్పారు. తాజాగా శివాజీ వ్యాఖ్యలుపై కూడా ఆమె పేరు ప్రస్తావించకుండా బదులు ఇచ్చారు.

అలానే శివాజీ చేసిన ఘాటు వ్యాఖ్యలకు సింగర్ చిన్మయి కూడా సోషల్ మీడియా వేదికగా మండి పడ్డారు. శివాజీ మహిళలను అవమానించేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలందరూ చీరే కట్టుకోవాలా? అని చిన్మయి ప్రశించారు. అలా అయితే మీరు కూడా జీన్స్, హుడీలు ఆపేసి.. ధోతి మాత్రమే కట్టుకోవాలి కదా అని అన్నారు.

ముందుగా తాము పాటించి.. ఆ తరువాత భారతీయ సంప్రదాయాల గురించి మాట్లాడాలని అన్నారు. మహిళల వేషాధారణపై మాట్లాడడం ఎంత వరకూ కరెక్ట్ అని ఎదురు ప్రశించారు. ఇటీవల ఒక మంచి సినిమాలో విలన్ గా చేసిన శివాజీ.. ఇప్పుడు ఒక పోకిరీలా మాట్లాడుతున్నాడని సింగర్ చిన్మయి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.