ప్రియాంక రెడ్డి ఘటన మరవకముందే హైదరాబాద్ లో మరో అమ్మాయి పై లైంగిక దాడి

0
10349

హైదరాబాద్ లో మరో అమ్మాయి పై లైంగిక దాడి జరిగింది. ఎన్ని పోరాటాలు, ఉద్యమాలు జరిగినా ఆడపిల్లలపై అకృత్యాలు ఆగడం లేదు. బయటికి వస్తేనే కాదు, ఇంట్లోనే ఉన్న లైంగిక దాడులు జరుగుతున్నాయి. ప్రియాంక ఘటనపై దేశం అంతా గర్జిస్తుండగానే హైదరాబాద్ లో మరో అమ్మాయి పై లైంగిక దాడి జరిగింది. హైదరాబాద్ లోని కూకట్పల్లి ప్రాంతంలో మాట్రిమోనీ ధ్వారా పరిచయం అయిన ఓ వ్యక్తి ఒంటరిగా ఉన్న ఓ యువతిపై లైంగిక దాడి చేసాడు. అపస్మాపక స్థితిలో ఉన్న ఆ యువతిని ఆమె అక్క చూసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే అక్కడకు పోలీసులు చేరుకొని విచారించారు. కేవలం పది రోజుల క్రితమే మాట్రిమోనీ ధ్వారా పరిచయం అయిన ఆ యువకుడు ఉదయం 10 గంటల సమయంలో తమ చెల్లి వద్దకు వచ్చినట్లు ఆమె తెలిపింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.