
లావణ్య కేసు రోజుకొక కొత్త మలుపు తిరుగుతోంది. హీరో రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ లావణ్య కేసు పెట్టిన తర్వాత ఈ వ్యవహారంలో అనేక అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మొదట రాజ్ తరుణ్‌పై ఆరోపణలు చేసిన లావణ్య, ఇప్పుడు మస్తాన్ సాయి అనే వ్యక్తి దగ్గర దాదాపు 300 మంది అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు ఉన్న హార్డ్ డిస్క్‌ను పోలీసులకు అందజేసింది. దీనిని ఆధారంగా చేసుకుని పోలీసులు మస్తాన్ సాయిని అరెస్టు చేశారు.
ఈ కేసు ముందుకు సాగుతున్న క్రమంలో లావణ్య గురించి కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. లావణ్య స్నేహితురాలు ప్రీతి ఈ వ్యవహారంలో సంచలన ఆరోపణలు చేసింది. లావణ్య తన జీవితాన్ని నాశనం చేసిందని, తాను డ్రగ్స్‌కు అలవాటు పడేందుకు కారణం లావణ్యేనని చెప్పింది. తనేకాదు, మరెంతో మందిని లావణ్య డ్రగ్స్‌కు బానిసలు చేసిందని ఆరోపించింది. అంతేకాదు, లావణ్య తన పరిచయస్తుల ఫోన్లు లాక్కొని వారిని బ్లాక్‌మెయిల్ చేసేది, మస్తాన్ సాయిని గత రెండేళ్లుగా బ్లాక్‌మెయిల్ చేస్తూ వస్తోందని వెల్లడించింది. ప్రీతీ చేసిన ఈ ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, లావణ్య నిజమైన స్వరూపం ఏమిటనే చర్చకు దారి తీసాయి.
ఇదే వ్యవహారంలో మరో మలుపు చోటుచేసుకుంది. లావణ్య మస్తాన్ సాయి తో పాటు బిగ్‌బాస్ కంటెస్టెంట్ శేఖర్ భాషపైనా పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీరిద్దరూ కలిసి తనను డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు ప్లాన్ చేసినట్లు, ఇందుకు సంబంధించిన కాల్ రికార్డింగ్‌లను కూడా పోలీసులకు అందజేసినట్లు తెలిపింది. అయితే, శేఖర్ భాష మాత్రం లావణ్య ఆరోపణలను ఖండించాడు. ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, లావణ్య డ్రగ్స్ తీసుకున్న విషయాన్ని బయటపెట్టాడు. అంతేకాదు, మేమంతా కలిసి పార్టీ చేసుకున్నాం, పోలీసుల మాకు టెస్ట్‌లు చేశారు, మరి లావణ్యకు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించాడు. ఆమెను కూడా టెస్ట్ చేయాలని డిమాండ్ చేశాడు. అంతేగాక, లావణ్య ఎంతో మందిని డ్రగ్స్‌కు అలవాటు చేయడంతో పాటు వారిని బ్లాక్‌మెయిల్ చేస్తోందని ఆరోపించాడు.
ఈ కేసు రోజుకొక కొత్త మలుపు తిరుగుతూ, రోజుకొక వ్యక్తి మీడియా ముందు వచ్చి లావణ్య గురించి నిజాలు బయట పెడుతుండటంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. లావణ్య ఆరోపణలపై పోలీసులు ఎందుకు స్పందించడం లేదనే ప్రశ్నలు నెటిజన్ల నుంచి వస్తున్నాయి. ఇది కేవలం హీరో రాజ్ తరుణ్‌తోనే పరిమితం కాకుండా, పెద్ద ముఠా వ్యవహారంగా మారిపోతోందనే భావన వ్యక్తమవుతోంది. లావణ్య చెప్పిన ఆరోపణలు నిజమా? లేక ఆమె ఏదైనా పెద్ద స్కెచ్ వేశారా? అన్నది మరి కొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముంది.