నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, మధ్య నెలకొన్ని చిన్న చిన్న వివాదాలతో సగటు ప్రేక్షకులు సినిమాకు దూరమవుతుంటారు. ఇది ఎవరి తప్పిదమో..? తేలేలోపే సినిమాపై అభిమానులు పెంచుకున్న క్యూరియాసిటీ కాస్త తగ్గుతుంది. ఇలాంటిదే ఇప్పుడు కేరళ సినీ అభిమానులను వేధిస్తోంది.
అవతార్.. జేమ్స్ కేమరూన్ కెమెరా నుంచి వచ్చిన విజువల్ వండరే ఈ మూవీ. ఈ మూవీని సీక్వెల్ గా తీశాడు జేమ్స్ కేమరూన్. మొదటి భాగం 18 డిసెంబర్, 2009లో రిలీజై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కేమరూన్ తన అద్భుత సృష్టితో ప్రేక్షకులను ‘పాంథోరా’ గ్రహానికి తీసుకెళ్లాడు.
అక్కడ జరిగే సీన్స్, గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ కు ప్రపంచ సినీ ఇండస్ర్టీ కూడా కితాబిచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ చూడని వారండరంటే అతిశయోక్తి లేదు. ఎలాంటి బోల్డ్ కంటెంట్ లేకుండా తెరకెక్కించిన పార్ట్ 1ను ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఆసక్తిగా తెరకెక్కించారు. ఇప్పుడు పార్ట్ 2 విడుదల నేపథ్యంలో సినిమాకు వెళ్లే వారు మొదటి పార్ట్ ను చూసి వెళ్తారట.
డిసెంబర్ 16న రిలీజ్
అవతార్ పార్ట్ 1కు సీక్వెల్ ఉండబోతుందని అప్పుడే డైరెక్టర్ ప్రకటించారు. చాలా సంవత్సరాల తర్వాత స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసి షూటింగ్ సెట్ పైకి తీసుకెళ్లాడు కెమరూన్. అప్పుడే ఆయన ఈ మూవీని 2022లో విడుదల చేయబోతున్నానని ప్రకటించాడు కూడా.
అయితే అభిమానులు, సినీ విశ్లేషకులు 2022 స్ట్రాటింగ్ లో వస్తుందని అనుకున్నారు. కానీ ఇయర్ సెకండ్ ఆఫ్ లో దాదాపు పార్ట్ 1 రిలీజైన డేట్ కు కొంచెం అటు ఇటుగా రిలీజ్ చేస్తామని చెప్పారు. అదే విధంగా ‘అవతార్: ద వే ఆఫ్ వాటర్’ డిసెంబర్ 16న రిలీజ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
కేరళ డిస్ర్టిబ్యూటర్స్ లొల్లి..
గ్రేజ్ విజువల్ వండర్ అవతార్ 2కు కేరళ ప్రేక్షకులు దూరం కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కేరళలో దీన్ని రిలీజ్ చేసేది లేదని తెగేసి చెప్తున్నారు డిస్ర్టిబ్యూటర్స్. ప్రపంచం మొత్తం థియేటర్ లో అవతార్ ను ఎంజాయ్ చేస్తుంటే తాము ఎందుకు మిస్సవ్వాలంటూ అభిమానులు బాధపడుతున్నారు.
సాధారణంగా మూవీ రిలీజైన మొదటి వారం ఆఫ్ ఆఫ్ పద్ధతిలో డిస్ర్టి్బ్యూటర్లు, నిర్మాతలు డబ్బులను షేర్ చేసుకుంటారు. కానీ కేరళ డిస్ర్టిబ్యూటర్లు మాత్రం తమకు ఈ మూవీకి సంబంధించి 65 శాతం వాటా కావాలంటూ రచ్చకెక్కుతున్నారు. మా డిమాండ్ పరిష్కరించకుంటే రీలీజ్ నిలిపివేస్తామంటూ తేల్చి చెప్తున్నారు.
కాగా అవతార్ ను ఇండియాలో రిలీజ్ చేసే నిర్మాతలు మాత్రం సగం కాకుండా కొంచెం పెంచి 55 శాతం ఇస్తామని చెప్తున్నారట. అయినా డిస్ర్టిబ్యూటర్లు వినడం లేదట. 65 శాతం వాటా ఇవ్వాల్సిందే అంటూ తెగేసి చెప్తున్నారట. ఈ నేపథ్యంలో కేరళలో రిలీజ్ అవుతుందా అన్న సందేహం కలుగుతుంది.
రిలీజ్ కు దాదాపు 2 వారాలు ఉన్నందున అప్పటి వరకూ ఈ వేడి చల్లారి డిస్ర్టిబ్యూటర్లు శాంతిస్తారని, తాము విజువల్ వండరైన అవతార్ 2ను థియేటర్ లో చూడవచ్చని సాధారణ ప్రేక్షకులు కలలు కంటున్నాడు. ఏది ఏమైనా ఈ గొడవ ముదిరితే మాత్రం కేరళ సినీ అభిమానులు ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ మిస్సవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.