టైటానిక్, అవతార్ వంటి సంచలన చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల మన్ననలు పొందిన మరోసారి తన ప్రతిభను నిరూపించడానికి సిద్ధమవుతున్నారు. అవతార్ ఫ్రాంఛైజీలో ఇప్పటికే రెండు భాగాలు విడుదలై భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. మొదటి భాగం తన సాంకేతిక నైపుణ్యంతో కొత్త చరిత్ర సృష్టించగా, రెండో భాగం అయిన “అవతార్: ది వే ఆఫ్ వాటర్” కొన్ని విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా మిరాకిల్స్ క్రియేట్ చేసింది. ఇప్పుడు అవతార్ 3 గురించి సూపర్ అప్డేట్ వైరల్ అవుతుంది.
అవతార్ 3 పేరును “ఫైర్స్ అండ్ యాష్”గా నిర్ణయించగా, ఈ సినిమా 2025 డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. కామెరూన్ ఈ సినిమాను మరింత వైవిధ్యంగా రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. యుకే ఎంపైర్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఈ సినిమా ప్రేక్షకుల ఆశలను ఎలా మించిపోతుందో చెప్పడంతోపాటు ఇందులో ఉన్న కొత్తతనాన్ని ప్రస్తావించారు.
కామెరూన్ మాటల ప్రకారం, అవతార్ 3లో భారీ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఉంటాయి. ఇప్పటివరకు ఫ్రాంఛైజీలో వచ్చిన భాగాలన్నింటికంటే ఇది అత్యంత సాహసోపేతంగా ఉంటుందని తెలిపారు. ప్రతిసారి రొటీన్‌ను అధిగమించి, కొత్తదనంతో ముందుకు సాగాలని ఆయన చెప్పడం ఈ సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది. ప్రేక్షకులు ఈ సినిమాలో చూడబోయే యాక్షన్ సన్నివేశాలు కేవలం వినోదం కోసం కాకుండా, అర్థవంతమైన సందేశాన్ని కూడా అందిస్తాయని కామెరూన్ హామీ ఇచ్చారు.
అవతార్ 3లో కొత్త పాత్రలను, కొత్త అంశాలను ప్రవేశపెట్టనున్నామని కామెరూన్ పేర్కొన్నారు. గత సినిమాల కన్నా వేగంగా ఈ చిత్రాన్ని పూర్తి చేస్తోన్నట్టు కూడా ఆయన వెల్లడించారు. “అవతార్: ది వే ఆఫ్ వాటర్”తో పోలిస్తే ఈ సినిమా రూపొందించడంలో అనుభవం, సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువగా ఉపయోగపడినట్లు తెలిపారు.
అంతేకాక, ఈసారి ప్రేక్షకులను పూర్తిగా ఎంటర్టైన్ చేసే విధంగా కొత్తదనాన్ని అందిస్తున్నామని కామెరూన్ సూచించారు. అవతార్ 3 ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా ఉంటుందని, అందులోని ఎమోషనల్ అంశాలు అందరిని ఆకట్టుకుంటాయని చెప్పారు. ఈ ఫ్రాంఛైజీకి ఉన్న క్రేజ్ దృష్ట్యా, “అవతార్ 3: ఫైర్స్ అండ్ యాష్” గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద మరో సంచలన విజయాన్ని నమోదు చేస్తుందనే నమ్మకం ఉంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రతి సీన్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేలా ఉండాలని కామెరూన్ భావిస్తున్నారు. 2025లో అవతార్ 3 సినిమా ఎలా ప్రభావం చూపుతుందో తెలియాలి అంటే మూవీ విడుదల వరకూ వేచి చూడాల్సిందే.