Saturday, April 17, 2021

మళ్లీ బాలయ్యను భయపెడుతున్న రవితేజ




సినిమా ప్రారంభోత్సవాలే కాదు.. విడుదలలు కూడా ఒక్కోసారి కాక రేపుతుంటాయి. భారీ కాంబినేషన్‌లు, బడ్జెట్‌లు, బడా హీరోలు ఇలా ప్రతి విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకుని బరిలోకి వచ్చే పెద్ద హీరోల సినిమాలు ఒక్కోసారి చిన్న, మిడిల్‌ హీరో చేతిలో దెబ్బ తింటుంటాయి. ఇలాంటి విచిత్రాలకు టాలీవుడ్‌లో కొదవే లేదు. పైగా ఇద్దరు హీరోలు మూడుసార్లు బాక్సాఫీస్‌ వద్ద తలపడితే.. ఈ మూడు సార్లూ ఓ మీడియం రేంజ్‌ హీరో తన సినీ ప్రత్యర్ధి అయిన అగ్ర హీరోపై విజయం సాధిస్తే ఆశ్చర్యమే కదా.

ఈ ఆశ్చర్యానికి తోడు అదే హీరోలు మళ్లీ ఒకేసారి తలపడటానికి సిద్ధమైతే ఇక నరాలు తెగే ఉత్కంఠను ఆపేదెవరు. ఈ ఉత్కంఠకు తెర తీస్తున్నారు నందమూరి బాయ్య`రవితేజ. గతంలో వీరిద్దరూ ఒక్కమగాడు`కృష్ణ చిత్రాలతో 2008 సంక్రాంతి బరిలో నిలవగా కృష్ణ సూపర్‌హిట్‌ కొట్టి సత్తా చూపించింది. మరోసారి వీరిద్దరూ 2009లో మిత్రుడు`కిక్‌ చిత్రాలతో తెరమీదకు వచ్చారు. ఈసారి కూడా కిక్‌ చిత్రం సూపర్‌హిట్‌తో రవితేజ పైచేయి సాధించాడు.

ముచ్చటగా మూడోసారి వీరిద్దరూ పరమవీరచక్ర`మిరపకాయ్‌ చిత్రాలతో మళ్లీ తలపడ్డారు. ఈసారి కూడా విజయం మిరపకాయ్‌ రూపంలో రవితేజనే వరించింది. తాజాగా మరోసారి వీరిద్దరూ పోటీ పడటానికి సిద్ధమౌతున్నారు. ప్రస్తుతం బాలయ్య బోయపాటితో హ్యాట్రిక్‌ సినిమా చేస్తున్నారు. కరోనాకు ముందే ప్రారంభం అయిన ఈచిత్రం ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. అలాగే రవితేజ నటించిన ‘క్రాక్‌’ ఇటీవలే విడుదలై సూపర్‌హిట్‌ కొట్టింది. ఈ సినిమా అనంతరం ప్రస్తుతం రవితేజ ‘ఖిలాడి’ చిత్రం చేస్తున్నారు.

ఈ రెండు సినిమాలు వేసవిలో విడుదలకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. గత మూడు పర్యాయాలు విజయం రవితేజను వరించింది. ఈసారి బాలయ్య బోయపాటితో కలిసి వస్తుండడం, ఈ సినిమా టీజర్‌ దుమ్మురేపడంతో ఈసారి విజయం తమదే అని బాలయ్య అభిమానులు తొడలు కొట్టి మరీ చెబుతున్నారు.




Related Articles

Latest Articles