Saturday, April 17, 2021

మరోసారి అభిమాని చెంప చెల్లు మనిపించిన బాలయ్య




అభిమానులకు కొట్టడంలో బాలయ్య తరువాతే ఎవరైనా. గతంలో అనేక మార్లు తన అభిమానులపై చేయి చేయి చేసుకున్న బాలయ్య బాబు.. ఈ సారి కూడా తన అభిమానిని చెంపకేసి లాగి పెట్టి కొట్టారు. హిందూపురంలో మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ఓ అభిమాని చెంప చెల్లు మనిపించారు. 9 వ వార్డ్ లో ఓ ఇంట్లోకి వెళ్లి ప్రచారం చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న అభిమాని వీడియో తీసేందుకు ప్రయత్నం చేసాడు.

అది చూసి కోపం తో ఊగిపోయిన బాలకృష్ణ.. అతడి చెంప చెల్లు మనిపించారు. ఆ వీడియో తీసేయమని ఆ అభిమానిని బెదిరించాడు బాలయ్య. తాను పర్సనల్ గా మాట్లాడుతుంటే వీడియో తీస్తావా? అంటూ బాలయ్య ఊగిపోయాడు.




Related Articles

Latest Articles