Wednesday, September 22, 2021

సినీ నటుడు సోను సూద్ పై కేసు నమోదు

ప్రముఖ సినీ నటుడు సోను సూద్ పై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మధ్య కాలంలో ప్రజలకు తన తోచిన సాయం చేస్తూ తరచు వార్తల్లో నిలుస్తున్న సోను సూద్ పై కేసు నమోదు కావడం అభిమానులను కలవర పెడుతుంది. అసలు కేసు ఎందుకు నమోదైందన్న వివరాలలోకి వెళితే.. మహారాష్ట్ర లో తన ఆరు అంతస్తుల భవనాన్ని తమ అనుమతి లేకుండా హోటల్ గా మార్చారని సినీ నటుడు సోను సూద్ పై మహారాష్ట్ర పోలీసులకు లిఖిత పూర్వక ఫిర్యాదు చేసింది బీఎంసీ. సోను పై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయాలనీ కోరింది.

హోటల్ కి అనుమతి లేని విషయంపై ఇప్పటికే బీఎంసీ సోను సూద్ కి నోటీసులు పంపినప్పటికీ, ఆయన స్పందించక పోవడంతో పోలీసులను ఆశ్రయించింది. ఆ భవన నిర్మాణాలలో మార్పులు చేస్తూ చట్ట విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారని పేర్కొంది. ఈ విషయం పై సోను భార్య సోనాలి పై కూడా ఫిర్యాదు చేశారు. తాము ఇప్పటికే రెండు సార్లు భవనాన్ని పరిశీలించి సోను సూద్ కి చెప్పినప్పటికీ, ఆయన పట్టించుకోలేదని తెలిపింది. గత నవంబర్ లోగా సమాధానం చెప్పాలని నోటీసులు ఇచ్చినప్పటికీ సోను సూద్ సమాధానం ఇవ్వకపోవడంతో పోలీసులను ఆశ్రయించాలని తెలిపింది బీఎంసీ.

Latest Articles