ప్రభాస్ ని చూసి వాత పెట్టుకున్నారా?

0
3952

బాహుబలి, సైరా నరసింహ రెడ్డి చిత్రాల తరువాత బాలీవుడ్ లో మన సినిమాల రేంజి పై ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక టాక్ బాగా వినపడుతుంది. అదే.. సినిమా కలెక్షన్ లు గురించి. ప్రభాస్ సినిమాలు బాహుబలి తరువాత బాలీవుడ్ లో మంచి మార్కెట్ సాధిస్తున్నాయి. అందుకు నిదర్శనమే ‘సాహో’ చిత్రం. ఈ చిత్రం విడుదల అయిన తొలి రోజునే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నా.. కలెక్షన్ ల పంట పండింది. అందుకు కారణం బాహుబలి తరువాత బాలీవుడ్ లో ప్రభాస్ కి వచ్చిన క్రేజ్. ప్రభాస్ సినిమా కోసం ఒక్క తెలుగు ప్రేక్షకులే కాకుండా.. బాలీవుడ్ సైతం ఎంతగానో ఎదురు చూసింది. బాలీవుడ్ కి ప్రభాస్ అంతగా నచ్చడానికి కారణాలు కూడా లేకపోలేదు. అందులో ముఖ్యంగా ప్రభాస్ కి గ్లామర్, పెర్సనాలిటీ. బాలీవుడ్ లో హీరో అవ్వాలంటే.. ముఖ్యంగా మంచి పెర్సనాలిటీ హీరో సొంతం అయి ఉండాలి. లేకుంటే.. అక్కడి జనాలు పెద్దగా పట్టించుకోరు. మంచి గ్లామర్, పెర్సనాలిటీ కలిగి ఉన్న హీరో ప్రభాస్ కావడంతో.. బాలీవుడ్ లో అమ్మాయిలు సైతం ప్రభాస్ అంటే పడి చస్తున్నారు.

అమ్మాయిలు తమ బాడీ లపై ప్రభాస్ టాటూ లు పొడిపించుకుంటున్నారంటే.. ప్రభాస్ బాలీవుడ్ జనాలకు ఎంత నచ్చాడో అర్ధం చేసుకోవచ్చు. ఇక బాలీవుడ్ సోషల్ మీడియాలో ప్రభాస్ కి అనేక గ్రూప్ లు ఏర్పడ్డాయి. బాలీవుడ్ లో సీనియర్ హీరోలను మించిన అభిమానులను ప్రభాస్ సంపాదించుకున్నాడు. అంతే కాదు.. బాలీవుడ్ లో ప్రభాస్ కి అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి. ఈ కారణంగానే హిట్, ప్లాప్ లతో తేడా లేకుండా.. ప్రభాస్ సినిమా వస్తుందంటే చాలు.. బాలీవుడ్ జనాలు ఎగపడ్డారు. అందుకే.. సినిమా ప్లాప్ అయినా, కలెక్షన్ ల పంట పండింది. అయితే.. ఇప్పుడు సైరా నరసింహ రెడ్డి చిత్రం విడుదల అవుతుందని తెలిసినా.. బాలీవుడ్ జనాలు పెద్దగా పట్టించుకోలేదు. సినిమా విడుదల అయిన రెండో రోజే.. కోట్లల్లో నుండి లక్షల్లోకి కలెక్షన్ లు పడి పోయాయి. బ్రిటిష్ వాళ్ళను పొడిచినంత మాత్రాన సినిమా హిట్ కాదాని.. సినిమాలో దమ్ము ఉండాలని చెప్పినట్లు, కలెక్షన్ లు లేక చాల చోట్ల ఈ సినిమాని ఎత్తేసారు కూడా. దీనితో ఇప్పుడు బాలీవుడ్ లో మన సినిమాల రేంజి పై ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక టాక్ బాగా వినపడుతుంది. ప్రభాస్ ని చూసి మెగా కాంపౌండ్ అనవసరంగా వాత పెట్టుకుందేమో అని గుసగుసలు వినిపిస్తున్నాయి.