బాలీవుడ్లో వరుసగా భారీ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండటం సినీ ప్రియుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది. షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ “దేవా” త్వరలో థియేటర్లలో సందడి చేయబోతోంది. ఈ కాప్ డ్రామా టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో, ఈ సినిమా భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉందని భావిస్తున్నారు. విడుదలకు ముందు నుంచే పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ రావడంతో, “దేవా” హిట్ అవుతుందనే అంచనాలు పెరిగాయి.
అయితే బాలీవుడ్లో మరింత భారీగా రాబోతున్న సినిమాలు ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసే స్థాయిలో ఉంటాయనే టాక్ నడుస్తోంది. ముఖ్యంగా హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ జోడీగా తెరకెక్కుతున్న “వార్ 2” భారీ యాక్షన్ కంటెంట్‌తో రాబోతుండటంతో, ఈ సినిమా 1000 కోట్ల క్లబ్లో చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. హృతిక్, ఎన్టీఆర్ క్రేజ్, యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ సినిమాకు ప్లస్ అవుతాయని భావిస్తున్నారు.
అలాగే, సల్మాన్ ఖాన్, ఏ.ఆర్. మురుగదాస్ కాంబినేషన్లో రూపొందుతున్న “సికందర్”పై కూడా మంచి హైప్ ఉంది. కానీ మురుగదాస్ గత కొన్నేళ్లుగా సక్సెస్ అందుకోలేకపోవడం, సల్మాన్ ఖాన్ ట్రాక్ రికార్డు కూడా అంతంత మాత్రంగా ఉండటం కొంత మంది సినీ విశ్లేషకుల్లో సందేహాలను రేకెత్తిస్తున్నాయి. అయినప్పటికీ, ఈ సినిమా బిగ్ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో, బాలీవుడ్లో భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే, అక్షయ్ కుమార్ నటించిన రెండు భారీ ఫ్రాంఛైజీ సినిమాలు కూడా ఈ ఏడాది విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. “జాలీ ఎల్.ఎల్.బి 3” మరియు “హౌస్‌ఫుల్ 5” చిత్రాలపై భారీ అంచనాలు ఉన్నాయి. కామెడీ, రొమాన్స్, యాక్షన్ మిక్స్ చేసి ఈ సినిమాలను రూపొందించడంతో, భారీగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలవని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అయితే అక్షయ్ కుమార్ ఇటీవల వరుస పరాజయాలను చవిచూడటంతో, ఈ సినిమాలు అతనికి హిట్ అవసరాన్ని తీర్చగలవా? అనేది చూడాలి.
మరోవైపు, “సింగం ఎగైన్” ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో, అజయ్ దేవగణ్ ఇప్పుడు “సన్ ఆఫ్ సర్దార్ 2” సినిమాపై భారీగా నమ్మకాన్ని పెట్టుకున్నాడు. దశాబ్దం తర్వాత ఈ ఫ్రాంఛైజీకి కొనసాగింపును ప్లాన్ చేయడం కొంత రిస్క్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నప్పటికీ, కామెడీ, యాక్షన్ మిశ్రమంగా ఉండటంతో ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది.
ఈ ఏడాది క్రిస్మస్కు ప్రపంచవ్యాప్తంగా “అవతార్ 3” విడుదల కానుంది. ఈ హాలీవుడ్ విజువల్ వండర్ భారీ స్థాయిలో విడుదల అవ్వడంతో, భారతీయ సినిమాలకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది. అయితే బాలీవుడ్, స్ట్రాంగ్ రిలీజ్ ప్లానింగ్ ద్వారా కొన్ని సినిమాలను ఈ పోటీ నుంచి కాపాడుకోవచ్చని అంటున్నారు. 2025లో బాలీవుడ్ నుంచి వస్తున్న ఈ భారీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద రూ. 500-1000 కోట్ల మధ్య వసూళ్లు సాధిస్తే, అది ఇండస్ట్రీకి గ్రేట్ కంబ్యాక్ అవుతుందని సినీ వర్గాలు ఆశిస్తున్నాయి.