నువ్వు చెడిపోయావు.. చచ్చిపో

0
11122

మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు చేసినా, ఎంత జాగ్రత్తలు తీసుకున్నా వారిపై అత్యాచారాలు, హత్యలు ఆగడం లేదు. అన్యాయానికి గురైన వారిపట్ల సానుభూతి చూపాల్సిన సమాజమే హేళన చేస్తూ, వారి మృతికి కారణమౌతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో సోమవారం వెలుగు చూసిన సంఘటన తీవ్ర కలకలo రేపుతోంది. అత్యాచారానికి గురైన బాలిక ఈ విషయాన్ని తన ప్రియుడితో చెప్పగా, అతను ఆమెకు అండగా నివాల్సింది పోయి, నువ్వు చెడిపోయావు ఈ విషయం తాగి చచ్చిపో అంటూ కూల్‌డ్రిoక్‌లో విషo కలిపి ఇచ్చాడు. ప్రియుడు అన్న మాటకు అవమానాన్ని భరించలేని బాలిక ఆ కూల్‌డ్రిరక్‌ను తాగి మృత్యు ఒడిలోకి చేరిపోయింది.

ఈ హృదయవిదారకమైన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా టి. నర్సాపురం మండంలో జరిగింది.
బాధిత బాలిక ఈనెల 7వ తేదీన మండంలోని మరో గ్రామంలో జరిగిన భజన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా మానికా రాజు అనే వ్యక్తి బాలికను అడ్డగించి అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని తన ప్రియుడు మిమిళ్ల సుబ్రహ్మణ్యానికి చెప్పి రోధించింది బాలిక. ఆమెకు జరిగిన అన్యాయాన్ని పెద్దలకు తెలియజేయాల్సిన ప్రియుడు, అలా చేయకుండా నువ్వు చెడిపోయావు ఇంకా బతికి అనవసరం అంటూ కూల్‌డ్రిoక్‌లో విషం కలిపి ఇచ్చాడు. దీన్ని అవమానంగా భావించిన బాలిక 9వ తేదీన కూల్‌డ్రిoక్‌ తాగి స్కూల్‌కు వెళ్లిపోయింది.

క్లాస్‌రూమ్‌లోనే అపస్మారక స్థితికి చేరుకోవడంతో జంగారెడ్డి గూడెంలోని ఓ ప్రయివేట్‌ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో గుంటూరుకు తరలిస్తుండగా మార్గ మధ్యలో బాలిక మృత్యువాత పడిoది. అయితే అప్పటికే విషయాన్ని తెలుసుకున్న బాలిక బంధువులు ఇరువురు యువకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు సుబ్రహ్మణ్యాన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజు కోసం గాలిస్తున్నారు.