
‘గేమ్ ఛేంజర్’ సినిమా ఇటీవల విడుదలై ప్రేక్షకులను నిరాశపరిచిన సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో, గ్రాండ్ విజువల్స్‌తో రూపొందింది. అయితే, పాతకాలం నేరేషన్, రొటీన్ సీన్స్ కారణంగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచింది. సినిమా విడుదలకు ముందు భారీ అంచనాలు ఏర్పడ్డప్పటికీ, కథ, కథనంలో నూతనత లేకపోవడంతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
రాం చరణ్ ఈ సినిమాలో రెండు విభిన్న పాత్రల్లో నటించి తన బెస్ట్ ఇచ్చాడు. అతని పెర్ఫార్మెన్స్కు మంచి ప్రశంసలు వచ్చినా, కథ కంటెంట్‌గా బలంగా లేకపోవడంతో సినిమా ప్రేక్షకులకు పూర్తిగా కనెక్ట్ కాలేదు. దాంతో, ఓటిటిలో కూడా ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి కనబడలేదు. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగి, మెగా ఫ్యాన్స్ కూడా కొంత మేర నిరాశ చెందారు.
ఇదే సమయంలో, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమా గురించి సెటైరిక్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఆయన వ్యాఖ్యలు మరింత వివాదాస్పదంగా మారడంతో చివరకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఇదంతా ఓవైపు ఉండగానే, ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం తాజా వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి.
బ్రహ్మానందం సాధారణంగా వివాదాలకు దూరంగా ఉంటారు. చిరంజీవి, మెగా ఫ్యామిలీకి ఆయన ఎంతో గౌరవం కలిగి ఉంటారు. కానీ, రీసెంట్గా ఓ మీడియా మీట్లో ‘గేమ్ ఛేంజర్’ గురించి మాట్లాడిన తీరే ఇప్పుడు హాట్ టాపిక్. ఈ సినిమాలో ఆయన కేవలం చిన్న పాత్రలో మాత్రమే కనిపించారు. దీనిపై ఓ జర్నలిస్ట్ ఆయనను ప్రశ్నించగా, బ్రహ్మానందం తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చారు.
“మీరు చూసింది చిన్న క్యారెక్టర్ కానీ నేను చేసింది పెద్ద క్యారెక్టర్” అంటూ ఆయన సమాధానం ఇచ్చారు. ఇది పరోక్షంగా శంకర్ టీమ్‌ను ఉద్దేశించిన సెటైర్‌గా మారింది. ఈ సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్రహ్మానందం పాత్ర నిజంగా పెద్దదా? లేదా చివరికి కట్ చేశారా అనే చర్చలు నడుస్తున్నాయి. ఆయన నటించిన సీన్స్ షూటింగ్ సమయంలో ఎక్కువగా ఉండి, తర్వాత ఎడిటింగ్‌లో తీసేసి ఉండొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా, ‘గేమ్ ఛేంజర్’ సినిమా విడుదల తర్వాత ఇది మరో ఆసక్తికరమైన చర్చగా మారింది.