తేడా గాడిలా మారిపోయావేంటి మామా?

0
1254

గత ఎన్నికల్లో కేవలం 23 సీట్లు తెచ్చుకొని ఘోరంగా ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ.. కొన్నాళ్ళు జగన్ పై ఏమి మాట్లాడకుండా ఉంది. అయితే.. జగన్ 100 రోజుల పాలన తరువాత నుండి జగన్ పైన, ప్రభుత్వం పైన విమర్శలు ఎక్కుపెట్టింది. తన రాజకీయం కోసం అవకాశం దొరికినప్పుడల్లా ఎదో ఒక అంశం తీసుకొని చంద్రబాబు జగన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ప్రజల్లో ఎక్కువగా వ్యతిరేకత లేకపోయినా.. చేసే పనుల్లో ఎదో ఒక తప్పు చూపిస్తూ పబ్బం గడుపుతున్నారు. అయితే.. గత కొన్నాళ్లుగా విజయసాయిరెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న లమధ్య మాటలు తీవ్ర స్థాయిలో ఉంటున్నాయి. ట్విట్టర్ ధ్వారా వీరిద్దరూ ఒకరిపై మరొకరు విరుచుకుపడుతున్నారు.

ఇక తాజాగా బుద్ధా వెంకన్న విజయసాయిరెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శకుని మామా నిన్ను చూస్తుంటే జాలేస్తోంది అని.. చెప్పుకోవడానికి మీ తుగ్లక్ చేసిన మంచి పని ఒక్కటి కూడా లేకపోవడంతో నీకు మతిభ్రమించిందని అన్నారు. ఇంకా ఆపకుండా “స్మశానాలకి రంగులు వేసుకున్నావు పాపం అనుకున్నాం. ఇప్పుడు చంద్రబాబు గారి హయాంలో రద్దు చేసిన బెల్టు షాపులు మీ తుగ్లక్ మళ్లీ రద్దు చేసాడా?” అంటూ ప్రశ్నించారు. దానిని కొనసాగిస్తూ.. “అన్నట్టు 43 వేల మద్యం షాపులు అని ట్వీట్ పెట్టావ్ ఏంటి? చిన్న మెదడు చితికిందా? లేక పైనుంచి జారీ అరికాల్లోకి వచ్చేసిందా ? మద్యం షాపుకి బెల్ట్ షాపుకి మధ్య తేడా తెలియని తేడా గాడిలా మారిపోయావేంటి శకుని” అంటూ తీవ్ర పదజాలం వాడారు.