Wednesday, September 22, 2021

రన్నింగ్ లో ఊడిన ఆర్టీసీ చక్రాలు

తూర్పు గోదావరి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. గోకవరం మండలం మారేడుమిల్లి గుత్తేడు పాత కోట వెళ్లే బస్సు రన్నింగ్ లో ఉండగా ఆర్టీసీ బస్సు చక్రాలు ఊడిపోయాయి. బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం నుండి ప్రయాణికులు సురక్షితంగా బయటపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆర్టీసీ అధికారులకు భాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

Latest Articles