Saturday, April 17, 2021

కారులో 3కండోమ్‌లు లేకపోతే ఫైన్‌?




పుకారుకు ఉండే వేగం గాలికి కూడా ఉండదంటారు. కొన్ని కొన్ని విషయాల్లో ఇది నిజమేననిపిస్తుంది. ఈ పుకార్లు ఒక్కోసారి అనవసరమైన తలనొప్పులను కూడా తెచ్చిపెడుతుంటాయి. తాజాగా ఢల్లీిలో రేగిన ఓ పుకారు ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇటీవల ఢల్లీి పోలీసులు క్యాబ్‌లను తనిఖీ చేస్తుండగా వాటిలోని ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌లో కండోమ్ లు దర్శనమిస్తున్నాయి. ఇది చూసిన పోలీస్‌లు ఆశ్చర్యపోయారు. ఇలా కారులో కండోమ్‌లు ఎందుకు పెడుతున్నారని డ్రైవర్‌లను నిలదీశారు. దానికి వారు చెప్పిన సమాధానం విని తలలు పట్టుకున్నారు పోలీసులు. ఇటీవల ఢల్లీిలో ఓ పుకారు మొదలైంది. క్యాబ్‌లోని ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌లో కండోమ్‌లు లేని కారణంగా ట్రాఫిక్‌ పోలీసులు ఫైన్‌ వేశారనేది దాని సారాంశం.

ఇది దావానంలా వ్యాపించడంతో ఎందుకొచ్చిన తలనొప్పి అని క్యాబ్‌ డ్రైవర్‌లు అందరూ కారులో కండోమ్‌లు పెట్టుకోవడం మొదలు పెట్టారు. పోలీసులు విచారించిన డ్రైవర్‌ లు తమకు తోటి డ్రైవర్‌లు కండోమ్‌లు పెట్టుకోవాలని చెప్పారని చెప్పడంతో పోలీసులు తీగ లాగడం మొదలు పెట్టారు. అలా వెళ్లి వెళ్లి ఈ కేసు ధర్మేంద్ర అనే డ్రైవర్‌ దగ్గర ఆగింది. ఈయన ర్యాష్‌ డ్రైవింగ్‌ కారణంగా పోలీసులు ఫైన్‌ రాశారు. అయితే సహచరుతో సరదాగా కారులో కండోమ్‌ లేదని పోలీసులు ఫైన్‌ రాశారు అని అబద్ధం చెప్పడంతో అది గందరగోళం సృష్టించింది.

ఈ విషయమై ఢల్లీి పోలీస్‌ స్పెషల్‌ కమీషనర్‌ తాజ్‌ హాసన్‌ మాట్లాడుతూ.. ఢల్లీి మోటారు వాహన చట్టం ప్రకారం ప్రజా రవాణాకు ఉపయోగించే అన్ని వాహనాల్లోనూ ప్రథమ చికిత్స కోసం ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌ ఉండాలని, అందులో మందులతో పాటు, టించర్‌, బ్యాండేజ్‌ క్లాత్‌, బ్యాండ్‌ఎయిడ్‌ ఉండాలి. అంతేగాని ఇలా కండోమ్‌లు పెట్టుకోవాలని లేదు. ఇది పుకారు మాత్రమే. దయచేసి డ్రైవర్‌లు దీనిని నమ్మవద్దు అంటూ విజ్ఞప్తి చేశారు. అసలే ఇటీవల ఢల్లీి, ముంబాయ్‌ వంటి నగరాల్లో కిడ్నాప్‌లు, రేప్ లు అధికం కావడం, ఇదే సమయంలో ఇలా క్యాబ్‌ డ్రైవర్‌లు ఏకంగా కండోమ్‌లు పెట్టుకు తిరగడం మరింత ప్రమాదకరమని గుర్తించిన పోలీసులు క్యాబ్‌ డ్రైవర్స్‌ యూనియన్‌ నాయకులకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. విచిత్రం ఏమిటంటే ఢల్లీిలోని సర్వోదయ అనే డ్రైవర్స్‌ సంఘం అధ్యక్షుడు కూడా తన కారులో 3 కండోమ్‌లు ఉంచుకున్నాడట.




Related Articles

Latest Articles