Saturday, April 17, 2021

ముదుర్లలో పెద్ద ముదురు చంద్రబాబు ఇలా చేశాడేమిటి?




ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న పవర్‌ దేనికీ లేదు అనేది అందరికీ తెలిసిందే. వార్డు స్థాయినో.. గ్రామ స్థాయినో పక్కన పెడితే ఎమ్మెల్యేలు సైతం కేవలo 10 ఓట్లు తేడాతో గెలుపు, ఓటమికి మధ్య కొట్టు మిట్టాడుతున్న రోజులివి (2014 ఎన్నికల్లో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కేవలo 12 ఓట్ల తేడాతో గెలుపొందారు). చేతిలో అధికారం లేనిదే చేసేది ఏమీ ఉండదు.

మరి అలాంటి అధికారం కోసం నాయకులు చేయాల్సింది ఏమిటి. ప్రజలను ఓట్లు వేయమని అభ్యర్థించాలి. నువ్వు వీరుడవు.. సూరుడవు.. మీ బతుకు ఎలా మార్చేస్తామో అంటూ ఆకాశానికి ఎత్తేయాలి. ఇలాంటి మాటలు చెప్పడంలో కొందరు నాయకులు మహా ముదుర్లు. ఇలాంటి ముదుర్లలో పెద్ద ముదురు చంద్రబాబు. కానీ ప్రస్తుతం తన పార్టీ పరిస్థితి చూసి, భవిష్యత్తు తలుచుకుని చంద్రబాబు ఫస్ట్రేషన్‌కు గురౌతున్నట్లు అనిపిస్తోంది.

లేకపోతే ఎన్నికల ప్రచారాని ప్రజల్లోకి వెళ్లి వారికి తమ పార్టీ అభ్యర్ధి గెలిస్తే చేయబోయే పనులు గురించి చెప్పాలి గానీ, మీకు సిగ్గులేదు. మీకు శరంలేదు. ఇంట్లో పడుకోండి అంటూ వారిని దూషించడం ఏమిటి. ఇలా చేస్తే పడే ఆ నాలుగు ఓట్లు కూడా పడవు. తాజాగా గుంటూరు, విజయవాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో అభ్యర్థుల తరపున ప్రచారం చేయడానికి జనం ముందుకు వచ్చిన చంద్రబాబు గుంటూరు, విజయవాడ రోడ్‌షోలో ప్రసంగిస్తూ ప్రజలను ఇలా నిందించారు.

అసలే వైసీపీ దెబ్బకు తుక్కు తుక్కు అయిపోతున్న పార్టీకి కాసిని ఓట్లు సంపాదించి పెట్టాలి గానీ.. ఇలా ఓటర్లనే తిడితే వచ్చే ఆ నాలుగు ఓట్లు కూడా రాకుండా పోతాయని అభ్యర్థులు గింజుకుంటున్నారు. చూడాలి బాబుగారు ఓటర్లపై ప్రయోగించిన ఈ తిట్ల అస్త్రం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో.




Related Articles

Latest Articles