ఆంధ్ర ప్రదేశ్ లో త్వరలో జరగబొయ్యే సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ మరియు జనసేన పార్టీలు కలిసి పోటీ చెయ్యబోతున్నాయి అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఈ ఇరు పార్టీలకు సంబంధించిన ఉమ్మడి కార్యాచరణ, ఉమ్మడి మ్యానిఫెస్టో తదితర అంశాలపై తరచూ చర్చలు జరుగుతున్నాయి.
సంక్రాంతి లోపు జనసేన పోటీ చెయ్యబోయే స్థానాలు, అలాగే ఉమ్మడి మ్యానిఫెస్టో ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ప్రస్తుతం పొత్తులో కీలకంగా మారిన అంశం, జనసేన కి ఎన్ని స్థానాలు ఇవ్వబోతున్నారు, ఓటు బదిలీ ఇరు పార్టీల మధ్య ఎలా జరగబోతుంది.
ఇత్యాది అంశాల పై అవగాహనా తెచ్చుకోవడం చాలా అవసరం ఉంది. రీసెంట్ గా నారాలోకేష్ అధికారం లోకి వచ్చిన తర్వాత ఎలాంటి పవర్ షేరింగ్ లేదని, చంద్రబాబు నాయుడు సంపూర్ణ ముఖ్యమంత్రిగా ఉంటాడని,
పవన్ కళ్యాణ్ కి ముఖ్యమంత్రి స్థానం ఇవ్వబోమని నోరు జారేసాడు. దీనిపై జనసేన పార్టీ అభిమానులు, కాపు సంఘాలు భగ్గుమన్నారు.
పవన్ కళ్యాణ్ ని వాడుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారం లోకి రావాలని అనుకుంటే ఈసారి అతని పప్పులు మా దగ్గర ఉడకవు, అల్లకల్లోలం చేసి పారేస్తాము అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలిపారు.
లోకేష్ తానూ మాట్లాడిన మాటల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేని పక్షం లో భవిష్యత్తులో చాలా తీవ్రమైన పరిణామాలు ఎదురుకోవాల్సి వస్తుంది అంటూ ఉత్తర్వులు కూడా జారీ చేసారు. దీంతో చంద్రబాబు లోకేష్ పై ఫైర్ అయ్యినట్టు తెలుస్తుంది.
నీకు, నాకు పవన్ కళ్యాణ్ కి మధ్య జరిగిన సంభాషణలు బయటకి ఎందుకు చెప్పావు?, ఇది చిన్న పిల్లల ఆటలు అనుకున్నావా?, ఇరు పార్టీల నుండో ఓటు బదిలీ అవ్వడం అంత తేలిక అనుకున్నావా?, అసలు సీట్ల సర్దుబాటు గురించి కానీ,
పవర్ షేరింగ్ గురించి కానీ చిన్న సమాచారం కూడా బయటకి లీక్ అవ్వడానికి వీలు లేదని, ఒకవేళ లీక్ జరిగితే సొంత కొడుకువి అని కూడా చూడను, పార్టీ నుండి సస్పెండ్ చేస్తా అని చాలా తీవ్రంగా వార్నింగ్ ఇచ్చాడని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు కొనసాగుతుంది. మరి మన చిన్నబాబు రాబొయ్యే రోజుల్లో ఎలా ఉంటాడో చూడాలి.