మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ జాతీయ అద్యక్ష్యుడు చంద్రబాబు నాయుడు సీఎం జగన్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నాడట. ఎంతలా అంటే కళ్ళు కాయలు కాచేలాగా అన్నమాట.
సంబంధం లేకుండా జగన్ కోసం చంద్రబాబు వెయిట్ చెయ్యడం ఏమిటి?, మతి ఉండే మాట్లాడుతున్నావా అని మీరు అనుకోవచ్చు. కానీ నిజంగా జగన్ కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. అసలు విషయం లోకి వెళ్తే సరిగ్గా మూడు నెలల్లో ఆంధ్ర ప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి.
3 రోజుల పాటు కాకినాడ కేంద్రంగా పవన్ రాజకీయం
ఈ ఎన్నికలలో టీడీపీ – జనసేన పార్టీలు కలిసి ఉమ్మడిగా పోటీ చెయ్యబోతున్నాయి. ఈ రెండు పార్టీలను కట్టడి చెయ్యడానికి జగన్ ఎన్నో వ్యూహాలు పన్నుతున్నాడు. ఇప్పటి వరకు ఉన్న సిట్టింగ్ ఎమ్యెల్యేల స్థానాలు ఈసారి బదిలీ అయ్యే అవకాశాలే కాదు,
టికెట్ దక్కని పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి. జగన్ కులసమీకరణలను దృష్టిలో పెట్టుకొని ఈసారి అభ్యర్థుల ఎంపిక చేస్తున్నాడట.
అందుకే టీడీపీ మరియు జనసేన పార్టీలు వైసీపీ అభ్యర్థుల జాబితా వచ్చేంత వరకు ఎదురు చూసి, ఆ తర్వాత తమ అభ్యర్థులను కూర్పు చేసి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. అప్పటి వరకు అభ్యర్థుల ప్రకటన ఉండబోదని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్.
అభ్యర్థులను ప్రకటించే ముందు టీడీపీ మరియు జనసేన మధ్య ఉమ్మడి అభ్యర్థుల జాబితా ఫైనల్ అవ్వాలి. వీళ్ళ మధ్య సయోధ్య కుదిరించుకొని ముందుకు వెళ్లేందుకే చాలా సమయం పడుతుంది. కాబట్టి ఇప్పట్లో అభ్యర్థుల జాబితా బయటకి వచ్చే అవకాశం కనిపించడం లేదు.
మరోపక్క వైసీపీ కూడా టీడీపీ – జనసేన మొదటి అభ్యర్థుల లిస్ట్ వస్తే కానీ తమ అభ్యర్థుల జాబితాని విడుదల చెయ్యమని కూర్చున్నారు. ఇలా ఈ రెండు పార్టీలు ఒకరి కోసం ఒకరు ఎదురు చూస్తున్నారు. ఈ లెక్కలు ఎప్పుడు తెగుతాయో చూడాలి.
జనవరి నెలాఖరున కానీ, ఫిబ్రవరి మొదటి వారం లో కానీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది. మార్చి నెలలో ఎన్నికలు, ఏప్రిల్ నెలలో ఫలితాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంతకు ముందు జరిగిన ఎన్నికలు వేరు, ఈసారి జరగబొయ్యే ఎన్నికలు వేరు.
హోరాహోరీ పోరు కచ్చితంగా ఉంటుంది, టీడీపీ జనసేన కూటమి కే గెలుపు అవకాశాలు అత్యధికంగా ఉన్నాయి అంటూ సర్వేలు సైతం చెప్తున్నాయి, చూడాలి మరి.