బ్యాడ్ కొలెస్ట్రాల్ ఈ మాట వింటేనే చాలా మంది బెంబేలెత్తిపోతారు. అవును మరి గుండె జబ్బులు, హార్ట్ స్ట్రోక్స్ ఇవే ముఖ్యకారణమని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు ఈ పరిస్థితి ఎక్కువ మందిలో కనిపిస్తుంది.
గతంలో మన తాతల సమయంలో ఎక్కువగా శ్రమను నమ్ముకుని జీవించే వారు. ఉదయం నుంచి రాత్రి పడుకునే సమయం వరకూ అందరూ ఏదో ఒక విధంగా ఒల్లవంటి కష్టపడేవారు.
ఇక నడక వారికి బాగా కలిసి వచ్చేది. ఎక్కడికి వెళ్లాలన్నా కళ్లనే నమ్ముకునే వారు మరీ ఎక్కువ దూరం అయితే ఎడ్లబండ్లు.
ఇక దూర ప్రాంతాలకు వెళ్లాలంటే బస్సుల్లో ప్రయాణించే వారు బస్టాప్ కు కూడా కాలినడకన వెళ్లేవారు. దీంతో వారి బాడీలో చెడు కలెస్ట్రాల్ కరిగిపోయేది. ఆరోగ్యంగా ఉండేవారు.
కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. ఎక్కడికి వెళ్లాలన్నా బైక్ లు ఉన్నాయి. కాస్తా ఎక్కువ దూరం వెళ్లాలంటే కారును బయటకు తీస్తున్నారు. బస్టాప్ వరకూ కూడా నడవడం లేదు.
వీటికి తోడు ఒళ్లువంటి పని చేసే ఉద్యోగాలు కాకపోవడం, జంక్ ఫుడ్ ఇలా ప్రతీ ఒక్కటీ నేటి తరం ఆయుష్షును తగ్గిస్తూ వస్తుంది.
జీర్ణక్రియల్లో కూడా ఇబ్బందులు వస్తుండడంతో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగి స్ట్రోక్స్ కు కారణం అవతున్నాయి. దీనికి తోడు మనం తీసుకునే ఆహారం, అందులో వాడే ఇంగ్రీడియన్స్ కూడా దోహదం చేస్తాయి.
ముఖ్యంగా వంట నూనెల విషయంలో జాగ్రత్తలు అవసరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులో కొవ్వులు తక్కువగా ఉన్నవి వాడితే మంచి ప్రయోజనం కనిపిస్తుందని చెప్తున్నారు.
కొవ్వులు తక్కువగా ఉన్న నూనెల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
నువ్వుల నూనె
నువ్వుల నూనె స్మోకింగ్ పాయింట్ తక్కువ. అంటే మరిగించేందుకు అనుకూలమైనది కాదు. ఇందులో కొలెస్ట్రాల్ ఉండదు. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ లో 5 గ్రాముల మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాట్. శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ 2 గ్రాములు ఉంటాయి.
పల్లి నూనె
దీన్ని ఎంత వేడిపై అయినా మరిగించవచ్చు. కాబట్టి ఎక్కువగా వీటితో గారెలు, పూరీలు, వడలు, తదితరాలు చేస్తారు. దీన్ని కూడా ఎక్కువ సార్లు వాడడం మంచిది కాదు. ఒక్క సారి కంటే ఎక్కువగా ఏ నూనెను వాడినా అది విషంగా మారుతుంది.
ఆలీవ్ ఆయిల్
ఆలివ్ ఆయిల్ లో హానికర కొవ్వులు ఉండవు. ఆరోగ్యానికి మంచి చేస్తుంటుందని ఆరోగ్య నిపుణులు దీన్ని వాడేందుకు ఎక్కువగా సూచిస్తుంటారు. అభివృద్ధి చెందిన దేశాల్లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
ఇది చాలా ఖరీదైనది. ఇందులో యాంటీ ఇన్ ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. శరీరానికి మంచి చేసే మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. దీనికి స్మోకింగ్ పాయింట్ తక్కువ సన్నని మంటపై చేసే ఆహారపదార్థాల కోసం ఉపయోగించాలి.
చియా సీడ్ ఆయిల్
చియా సీడ్స్ కూడా నల్ల నువ్వుల లాగా ఉంటాయి. ఇందులో అల్ఫా లినోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది గుండెకు మంచి చేసే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ను ఉత్పత్తి చేయడంలో తోడ్పడుతుంది. స్మోకింగ్ పాయింట్ ఎక్కువ కాబట్టి బాగా మరిగే వంటకాలను చేసుకోవచ్చు.
అవకాడో నూనె
అవకాడో పండు నుంచి ఈ నూనెను సేకరిస్తారు. హై టెంపరేచర్ వద్ద కూడా దీన్ని ఉపయోగించవచ్చు. ఈ నూనెలో మోనో అన్ శాచురేటెడ్ కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇన్ ఫ్లమేషన్ తగ్గించేందుకు యాంటీ ఆక్సిడెంట్లుగా ఈ ఆయిల్ ఉపయోగపడుతుంది.